సంక్రాంతికి రిలీజైన సినిమాలన్నీ దాదాపు క్లోజింగ్ కు వచ్చేశాయి. దీంతో ఈ వారం కాస్త ఆసక్తి కలిగించే సినిమాలు థియేటర్లలోకి అడుగు పెట్టనున్నాయి. గుణశేఖర్ ‘యుఫోరియా’, ‘బిగ్‌బాస్’ అమర్‌దీప్ సుమతీ శతకం చిత్రాలతో పాటు ‘శ్రీ చిదంబరం గారు’, ‘చాయ్ వాలా’, ‘బరాబర్ ప్రేమిస్తా’, ‘ఆపరేషన్ పద్మ’, ‘బ్లడ్ రోజెస్’, ‘హనీ’ తదితర తెలుగు సినిమాలు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయనున్నాయి. అలాగే ఛాంపియన్ బ్యూటీ అనస్వర రాజన్ నటించిన ‘విత్ లవ్’ అనే డబ్బింగ్ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు ఓటీటీల్లో ఈ వీకెండ్ బోలెడన్ని హిట్ మూవీస్ రిలీజ్ కానున్నాయి. ముఖ్యంగా సంక్రాంతికి రిలీజైన సినిమాలన్నీ దాదాపు ఈ వారంలోనే ఓటీటీలోకి రానున్నాయి. ప్రభాస్ ది రాజాసాబ్, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారీ, శివకార్తికేయన్ పరాశక్తితో పాటు సైక్ సిద్ధార్థ, నీలకంఠ లాంటి తెలుగు మూవీస్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో నారీ నారీ నడుమ మురారి, సైక్ సిద్ధార్ధ ఇప్పటికే ఓటీటీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చాయి. మరి వీటితో పాటు ఈ వారం ఏయే సినిమాలు ఏయే ఓటీటీల్లో సందడి చేయనున్నాయో తెలుసుకుందాం రండి.
ఆహా
- సైక్ సిద్ధార్థ (తెలుగు సినిమా) – ఇప్పటికే స్ట్రీమింగ్ కు వచ్చేసింది
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో..
ఇవి కూడా చదవండి
- క్యాష్ క్వీన్స్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 05
- ద లింకన్ లాయర్ సీజన్ 4 (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 05
- క్వీన్ ఆఫ్ చెస్ (ఇంగ్లిష్ మూవీ) – ఫిబ్రవరి 06
- సాల్వడార్ (స్పానిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 06
అమెజాన్ ప్రైమ్
- నారీ నారీ నడుమ మురారి (తెలుగు సినిమా) – ఇప్పటికే స్ట్రీమింగ్ కు వచ్చేసింది
- రిలేషన్‌షిప్ గోల్స్ (ఇంగ్లిష్ మూవీ) – ఫిబ్రవరి 04
- ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లిష్ సినిమా) – ఫిబ్రవరి 06
- ఎల్ఓఎల్ (ఇంగ్లిష్ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 06
జియో హాట్‌స్టార్
- రాజాసాబ్ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 06
జీ5
- షాబాద్ (హిందీ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 06
- పరాశక్తి (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఫిబ్రవరి 07
సన్ నెక్స్ట్
- నీలకంఠ (తెలుగు సినిమా) – ఫిబ్రవరి 06
సోనీ లివ్
- జాజ్ సిటీ (హిందీ వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 06
Note: ఇవి కాక వారం కొన్ని ఓటీటీ సంస్థలు అప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లను ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా స్ట్రీమింగ్ కు తీసుకువచ్చే అవకాశముంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.