ఈ మధ్యన ఓటీటీల్లో సినిమాల కంటే వెబ్ సిరీస్ లే ఎక్కువగా వస్తున్నాయి. హిందీ, తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ.. ఇలా ప్రముఖ భాషల్లోనూ వెబ్ సిరీస్ లు తెరకెక్కుతున్నాయి. ఓటీటీ ఆడియెన్స్ కూడా వీటిని బాగా ఆదరిస్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్న వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. ఇది ఒక నూతన వధూవరుడి హత్య చుట్టూ తిరుగుతుంది. అది కూడా హనీమూన్ లో ఈ మర్డర్ జరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. నూతన దంపతులు మాల్దీవులకు హనీమూన్ కు వెళతారు. అయితే ఒక మహిళా ఫోటోగ్రాఫర్ కూడా వారి ఫోటోలు తీయడానికి వస్తుంది. ఆ రోజు రాత్రే అక్కడి బీచ్ లో శవమై కనిపిస్తాడు భర్త. మరి ఆ హత్య ఎవరు చేశారన్న మిస్టరీని ఛేదించే కథతో ఈ సిరీస్ తెరకెక్కించారు. ఇదంతా చూస్తుంటే ఇటీవల జరిగిన మేఘాలయ హనీమూన్ మర్డరే గుర్తకు వస్తుంది కదా. అయితే ఈ వెబ్ సిరీస్ 2024లోనే వచ్చింది. దీని పేరు ‘హనీమూన్ ఫోటోగ్రాఫర్.’ అర్జున్ శ్రీవాస్తవ ఈ వెబ్ సిరీస్‌కి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో ఆశా నేగి, రాజీవ్ సిద్ధార్థ, అపేక్ష పోర్వాల్, సాహిల్ సలాథియా తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
ఇవి కూడా చదవండి
హనీమూన్ ఫోటోగ్రాఫర్ గతేడాది సెప్టెంబర్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. థ్రిల్లింగ్, సస్పెన్స్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండడంతో ఈ వెబ్ సిరీస్ కు ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉంది. ఇందులో ఆరు ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 30-35 నిమిషాల నిడివి ఉంది. హిందీతో పాటు తెలుగులోనూ ఈ వెబ్ సిరీస్ అందుబాటులో ఉంది. వీకండ్ లో మంచి ఇంట్రెస్టింగ్ సస్పెన్స్ సిరీస్ చూడాలనుకునేవారికి ‘హనీమూన్ ఫోటోగ్రాఫర్’ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.
జియో సినిమాలో హనీమూన్ ఫొటో గ్రాఫర్ వెబ్ సిరీస్
Ek photographer, ek picture-perfect honeymoon aur ek deadly secret🔪 Who’s the killer? #HoneymoonPhotographer, streaming 27 September onwards, exclusively on JioCinema Premium.@AshaNegi7 @ApekshaPorwal #RajeevSiddhartha @SalathiaSahil @JasonThamIndia @Sushmitha_S… pic.twitter.com/VQArQmcEUS
— JioCinema (@JioCinema) September 19, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..