OTT Movie: ఓటీటీలో రవితేజ మేనల్లుడి రొమాంటిక్ థ్రిల్లర్.. ఈ తెలంగాణ బ్యాక్ డ్రాప్ మూవీకి IMDBలో టాప్ రేటింగ్

OTT Movie: ఓటీటీలో రవితేజ మేనల్లుడి రొమాంటిక్ థ్రిల్లర్.. ఈ తెలంగాణ బ్యాక్ డ్రాప్ మూవీకి IMDBలో టాప్ రేటింగ్


ఈ మధ్యన థియేటర్లలో ఆడని కొన్ని సినిమాలు ఓటీటీల్లో అద్దరగొడుతున్నాయి. బిగ్ స్క్రీన్ పై ప్రభావం చూపని చిత్రాలు డిజిటల్ స్ట్రీమింగ్ పై మాత్రం రికార్డ్ వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా కూడా థియేటర్లలో పెద్దగా ఆడలేదు. పేరున్న నటీనటులు, బ్యానర్ లేకపోవడం, పెద్దగా ప్రమోషన్లు కూడా నిర్వహించకపోవడంతో ఈ సినిమా ఎప్పుడు థియేటర్లలో రిలీజైందో కూడా చాలా మందికి తెలియదు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 18న థియేటర్లలో రిలీజైంది. సుమారు రెండున్నర నెలల తర్వాత ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. ఇదో రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. అలాగే ఇటీవల తెలంగాణ బ్యాక్‌డ్రాప్ లో వచ్చిన మరో సినిమా ఇదే. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండే దిండ అనే గ్రామంలో 1994లో జరిగిన కథగా ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా కథంతా సత్యం (రవితేజ మేనల్లుడు అవినాశ్ వర్మ), సరిత ప్రేమ చుట్టూ తిరుగుతుంది. సర్పంచ్ మేనకోడలైన సరితను సత్యం ప్రేమిస్తాడు. ఆమె కూడా అతనిని ఇష్టపడుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అయితే వీరిద్దరి ప్రేమ విషయం ఆ ఊళ్లో పెద్ద దుమారమే రేపుతుంది. సర్పంచ్ కూడా అగ్గిమీద గుగ్గిలం అవుతాడు. మరి ఆ తర్వాత ఏం జరిగింది? సత్యం, సరిత ఒక్కటవుతారా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

ఈ రొమాంటిక్ థ్రిల్లర్ పేరు జగమెరిగిన సత్యం. తిరుపతి తెరకెక్కించిన ఈ సినిమాను విజయ భాస్కర్ నిర్మించాడు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించాడు. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం (జులై 04) అర్ధరాత్రి నుంచి ఈ సినిమా సన్ నెక్ట్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని సదరు ఓటీటీ సంస్థనే సోషల్ మీడియా ద్వారా అధికారికంగా వెల్లడించింది. అహంకారంతో నడిచే ఓ ఊళ్లో ఒక వ్యక్తి ప్రేమ అతని అతిపెద్ద తిరుగుబాటు అయింది. జగమెరిగిన సత్యం సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. రొమాంటిక్ థ్రిల్లర్ అలాగే ప్రేమకథా సినిమాలు చూడాలనుకునేవారికి ఈ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

సన్ నెక్ట్స్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *