ఈ మధ్యన సంచలనం సృష్టించిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇవి ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. చిలకలూరి పేట బస్సు దహనం కేసు ఆధారంగా ఇటీవల రిలీజైన ఇరవై మూడు సినిమా బాగానే ఆడింది. ఇప్పుడు ఓటీటీలోనూ ఈ రియల్ స్టోరీకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా ఒక నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కినదే. 2003లో కేరళలో జరిగిన ఓ నరమేధం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. ఆ సమయంలో ముత్తంగ అనే ఆదివాసీ లు తమ భూ హక్కుల కోసం చేసే పోరాటం, దానిని పోలీసులు అత్యంత క్రూరంగా అణచివేసిన తీరును ఈ సినిమాలో చూపించారు. గిరిజనులను అక్కడి నుంచి తరిమేసే నేపథ్యంలో గిరిజనులు, పోలీసుల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. మేలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బ్లాక బస్టర్ గా నిలిచింది. కేవలం రూ.10 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా రూ. 30 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఐఎమ్ డీబీలోనూ ఈమూవీకి 7.5 రేటింగ్ దక్కడం విశేషం. అయితే తెలుగులో పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడంతో ఇక్కడ పెద్దగా ఆడలేదు.
ఇప్పుడీ బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. మలయాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వస్తోంది. ఇంతకీ ఈ సినిమా ఏదనుకుంటున్నారా? మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన నరివెట్ట. తెలుగులో నక్కల వేట పేరుతో థియేటర్లలో రిలీజైంది. అనురాజ్ మనోహర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు కథను అబిన్ జోసెఫ్ అందించాడు. సీనియర్ నటుడు సూరజ్ వెంజరమూడు మరో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడీ సినిమా సోనీ లివ్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కు రానుంది. జులై 11 నుంచి ఈ సూపర్ హిట్ సినిమాను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు స్ట్రీమింగ్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. నిజం ప్రతిధ్వనులు, అన్యాయం నీడలు.. నరివెట్ట మూవీని జులై 11 నుంచి కేవలం సోనీలివ్ లో మాత్రమే చూడండి” అనే క్యాప్షన్ తో నరివెట్ట ఓటీటీ ట్రైలర్ కూడా రిలీజ్ చేసింది.
నరివెట్ట సినిమా ట్రైలర్..
Echoes of truth, shadows of injustice!
Watch Narivetta from July 11 only on SonyLIV#NarivettaOnSonyLIV@ttovino #SurajVenjaramoodu #Cheran #AnurajManohar #AryaSalim #JakesBijoy pic.twitter.com/lon0ikr836
— Sony LIV (@SonyLIV) July 2, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..