ఎప్పటిలాగే గత శుక్రవారం (ఆగస్టు 01) పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వచ్చాయి. దాదాపు 35కి పైగా కొత్త సినిమాలు,వెబ్ సిరీసులు వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి వచ్చాయి. నితిన్ తమ్ముడు, ఆమిర్ ఖాన్ సితారే జమీన్ పర్, సిద్ధార్థ్ 3 బీహెచ్‌కే, సుహాస్ ఓ భామ అయ్యో రామ, పాపా, కలియుగం 2064 వంటి సినిమాలు కాస్త ఆకట్టుకుంటున్నాయి. అయితే వీటితో పాటు స్ట్రీమింగ్ కు వచ్చిన ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా ఓటీటీ ఆడియెన్స్ ను తెగ ఆలరిస్తోంది. హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ట్విస్టులు పుష్కలంగా ఉండడంతో ఈ మూవీ రికార్డు వ్యూస్ తో టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్లుతోంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియాలో ఈ కథ సాగుతుంది. అనాథగా పెరిగిన సుశాంత్ నైట్ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుంటాడు. ఓ రోజు రాత్రి అతను పనిచేసే కెమికల్ కంపెనీ బిల్డింగ్‌లో ముగ్గురు వ్యక్తులు ఓ అమ్మాయిని హత్య చేసే ప్రయత్నం చేస్తుంటారు. వారి నుంచి ఆ అమ్మాయిని సేవ్ చేస్తాడు సుశాంత్. దీని తర్వాత ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు సుశాంత్. సపరేట్‌గా కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు. అయితే సుశాంత్ పని చేసే బిల్డింగ్ లో రాత్రి సమయంలో భయానక శబ్దాలు వినిపిస్తుంటాయి. దీంతో ఆ బిల్డింగ్ లో దెయ్యాలు ఉన్నాయని అందరూ నమ్ముతారు. ఆ తర్వాత సుశాంత్ కలలోకి దెయ్యాలు వస్తుంటాయి. దీంతో తన భార్యను తీసుకుని ఒక రోజు రాత్రి ఆ బిల్డింగ్ లోకి వెళతారు. అక్కడ తాళం వేసిన ఓ కొత్త రూమ్‌లోకి వెళ్తారు. అక్కడ వారికి భయంకరమైన అనుభవాలు ఎదురవుతాయి.
ఈ క్రమంలో సుశాంత్ భార్య కింద పడిపోతుంది. ఆస్పత్రిలో చేర్పిస్తే ఆమెలో మరో ఆత్మ చేరిందని, ఇప్పుడు తన కంట్రోల్ లోనే ఆమె ఉందని చెబుతారు. మరి సుశాంత్ భార్యలోకి చేరిన ఆ ఆత్మ ఎవరిది? దాని కథేంటి? ఆ ఆత్మ నుంచి సుశాంత్ భార్య ఎలా బయటపడింది? అందుకు సుశాంత్ ఏం చేశాడన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ హారర్ థ్రిల్లర్ సినిమా పేరు గార్డ్. విరాజ్ రెడ్డి, మీమీ లియోనార్డ్, శిల్ప బాలకృష్ణన్. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్, హర్రర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి గార్డ్ మూవీ ఒక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి