Headlines

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతి సూపర్ హిట్ సినిమా.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు

OTT Movie: ఓటీటీలోకి వచ్చేసిన సంక్రాంతి సూపర్ హిట్ సినిమా.. పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకోవచ్చు


టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ నటించిన లేటెస్ట్ సినిమా ‘నారీ నారీ నడుమ మురారి’. గతంలో సామజవరగమన లాంటి హిలేరియట్ ఎంటర్ టైనర్ మూవీని తెరకెక్కించిన రామ్ అబ్బరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శర్వానంద్ సరసన సంయుక్త మేనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి బరిలో చివరిగా అంటే జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది. రాజాసాబ్, మన శంకరవరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు వంటి స్టార్ హీరోల సినిమాలను తట్టుకుని మరీ మంచి వసూళ్లు సాధించింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ‘నారీ నారీ నడుమ మురారి’ సుమారు రూ. 20 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. శర్వానంద్ యాక్టింగ్, వీకే నరేష్ కామెడీ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ‘నారీ నారీ నడుమ మురారి’ ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 04 నుంచి ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీలోకి తీసుకురానున్నట్లు ఇది వరకే ఓటీటీ సంస్థ ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే బుధవారం అర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ సంస్థనే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. . ఈ మేరకు నారీ నారీ నడుము మురారీ మూవీ కొత్త పోస్టర్ ను పంచుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ శర్వానంద్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

నారీ నారీ నడుము మురారీ సినిమాలో వీకే నరేష్, వెన్నెల కిశోర్, సునీల్, సత్య, సిరి హనుమంత్, మదునందన్, సంపత్ రాజ్, రఘుబాబు, సుదర్శన్, గెటప్ శీను తదితరులు ప్రధాన పాత్రల్లో మెరిశారు. అలాగే యంగ్ హీరో శ్రీ విష్ణు ఒక స్పెషల్ క్యామియో రోల్ పాత్రలో సందడి చేశాడు. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్‌, ఎకె ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిరించిన ఈ సినిమాకు విశాల్ చంద్ర శేఖర్ స్వరాలు సమకూర్చారు. మరి థియేటర్లలో ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ ను మిస్ అయ్యారా? లేదా ఇంకోసారి చూడాలనుకుంటున్నారా? అయితే ఎంచెక్కా అమెజాన్ ప్రైమ్ లో చూసేయండి.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *