OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. IMDBలోనూ టాప్ రేటింగ్

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. IMDBలోనూ టాప్ రేటింగ్


కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా అన్ని సినిమాలను చూసేస్తున్నారు తెలుగు ఆడియెన్స్. ముఖ్యంగా ఓటీటీలో తమిళం, కన్నడ, హిందీ, మలయాళం ఇతర భాషల సినిమాలను తెగ చూసేస్తున్నారు. ఇక మలయాళం సినిమాలు, వెబ్ సిరీస్ లనయితే అసలు వదిలిపెట్టడం లేదు. ఆడియెన్స్ అభిరుచికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రతి వారం రెండు, మూడో మలయాళం సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. అలా గురువారం (ఫిబ్రవరి 19) కూడా ఓ మలయాళం సూపర్ హిట్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. గత వారమే (ఫిబ్రవరి 13) ఈ సినిమా తెలుగు వెర్షన్ థియేటర్లలో రిలీజైంది. అయితే పెద్దగా ప్రమోషన్లు చేయకపోవడంతో తెలుగు ఆడియెన్స్ ఈ మూవీ గురించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ మూవీ మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. కేరళలోని ఓ గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. ఈ ముగ్గురికి వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ) అంటే పిచ్చి. ఈ గేమ్ లో రెజ్లర్లు తీవ్రంగా కొట్టుకుంటుంటే ఈ బ్రదర్స్ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అలా డబ్ల్యూడబ్ల్యూఈపై పిచ్చితోనే గ్రామంలో అలాంటి పోటీలు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం గ్రామంలో ఒక అండర్ గ్రౌండ్ రెజ్లింగ్ క్లబ్ ప్రారంభిస్తారు. అక్కడ కుస్తీ పోటీలు నిర్వహిస్తారు. అయితే ఈ రెజ్లింగ్ క్లబ్ వల్ల వీరి జీవితాలు అనూహ్యంగా మారిపోతాయి. చివరకు ఈ అన్మదమ్ములు ఏమయ్యారన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

చథా పచ్చ ట్రైలర్..

ఈ సినిమా పేరు చథా పచ్చ. తెలుగు ఆడియెన్స్ కు బాగా పరిచయం ఉన్న అర్జున్ అశోకన్, రోషన్ మాథ్యూ, విషాక్ నాయర్ తదితరులు ఈ మూవీలో లీడ్ రోల్స్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది.

తెలుగులోనూ స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *