OTT Movie: ఇప్పుడీ చిన్న సినిమాను యూత్ తెగ చూసేస్తున్నారు.. ఏకంగా మూడు ఓటీటీల్లోనూ టాప్ ట్రెండింగ్

OTT Movie: ఇప్పుడీ చిన్న సినిమాను యూత్ తెగ చూసేస్తున్నారు.. ఏకంగా మూడు ఓటీటీల్లోనూ టాప్ ట్రెండింగ్


కంటెంట్ బాగుంటే చాలు చిన్న సినిమాలైనా సంచలనాలు సృష్టిస్తాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతాయి. ఒక వేళ థియేటర్లలో ఫెయిల్ అయినా ఓటీటీలోనూ అదరగొడుతుంటాయి. ఈ మధ్యన రిలీజైన కొన్ని చిన్న సినిమాలను చూస్తే ఇదే అర్థమవుతోంది. ఇప్పుడు అలాంటి ఒక చిన్న సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో అదరగొడుతోంది. డిపరెంట్ కాన్సెప్ట్ తో పాటు యూత్ కు నచ్చే అంశాలు ఈ మూవీలో పుష్కలంగా ఉండడంతో ఈ మూవీ ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో ఉంటోంది. అది కూడా ఏకంగా మూడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో. గతేడాది డిసెంబర్ కానుకగా ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. మరీ బ్లాక్ బస్టర్ కాకపోయినా ఓ మోస్తరుగా ఆడింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లే రాబట్టింది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. హైదరాబాద్ లోని బస్తీలో ఉండే యువకుడు విస్కీ. డబ్బున్న అబ్బాయి అరుణ్. కానీ వీరిద్దరు మంచి స్నేహితులుగా ఉంటారు. అలాంటి ఈ ప్రాణ స్నేహితుల జీవితలోకి ఐశ్వర్య అనే అమ్మాయి వస్తుంది. ఇద్దరూ ఆమెనే ప్రేమిస్తారు. దీంతో విస్కీ, అరుణ్ జీవితాలు మలుపు తీసుకుంటాయి. దీంతో అప్పటిదాకా బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉన్న విస్కీ, అరుణ్ ఐశ్వర్య కోసం బద్ద శత్రువులుగా మారుతారు. ఆమెను సొంతం చేసుకునేందుకు ఒక పోటీలో పాల్గొంటారు. మరి ఆ పోటీ ఏంటి? అందులో ఎవరు గెలిచారు? ఐశ్వర్య ప్రేమ ఎవరికి దక్కింది? అసలు ఐశ్వర్య ఇద్దరిని ఎందుకు లవ్ చేసింది? అన్నది తెలుసుకోవాలంటే ఈ మూవీని చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ మూవీ పేరు పతంగ్. ప్రణీత్ ప్రత్తిపాటి తెరకెక్కించిన ఈ మూవీలో వంశీ పూజిత్, ప్రణవ్ కౌశిక్, ప్రీతి పగడాల కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సినిమా సన్ నెక్ట్స్ తో పాటు
అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా ఓటీటీల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ కావాలంటే పతంగ్ మూవీ ఒక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.

మూడు ఓటీటీల్లో పతంగ్ సినిమా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *