OTT Movie: ఇదేం సినిమా రా బాబూ.. మొత్తం ట్విస్టులే.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న కోర్టు డ్రామా..

OTT Movie: ఇదేం సినిమా రా బాబూ.. మొత్తం ట్విస్టులే.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న కోర్టు డ్రామా..


కోర్టు డ్రామా చిత్రాలు మిమ్మల్ని ఎప్పుడూ ఆకట్టుకుంటాయి. నిత్యం సస్పెన్స్, ట్విస్టులతో సాగే ఈ చిత్రాలు చూసేందుకు అడియన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ కోర్టు డ్రామాను తీసుకువచ్చాయి. ఇది తల్లి-కూతురు ఆధారంగా ఉంటుంది. కానీ మొదటి 10 నిమిషాలు చూస్తే క్లైమాక్స్ వరకు చూడాలనే ఉత్సుకత మిమ్మల్ని నిలవనివ్వదు. ఆ సినిమా పేరే ‘యుద్ధకండ్ చాప్టర్ 2’. కన్నడ భాషలో నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణ అజయ్ రావు, అర్చన జాయిస్, ప్రకాష్ బెలవాడి, సాత్విక్ కృష్ణన్ వంటి ముఖ్యమైన పాత్రలు పోషించారు. తన కూతురికి న్యాయం చేయాలని కోర్టులో వేడుకునే తల్లి చుట్టూ తిరుగుతుంది. ఒంటరి తల్లి నివేదిత పోలీసుల నుండి తుపాకీని లాక్కొని, కోర్టు బయట జాకీ అలియాస్ జనార్దన్ అనే బాలుడిని కాల్చి చంపడంతో ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మరణిస్తాడు.

ఆ తర్వాత ఈ విషయం కోర్టుకు చేరుకుంటుంది. నిజానికి చనిపోయిన కుర్రాడు జాకీ, నివేదిత 7 ఏళ్ల కుమార్తెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే తమ్ముడు. ఈ సంఘటన తర్వాత నివేదిత కుమార్తె కోమాలోకి వెళుతుంది, కానీ ఆమెకు కోర్టులో డేట్ మాత్రమే లభిస్తుంది. మరోవైపు ఎమ్మెల్యే తన తమ్ముడిని కాపాడుకోవడానికి.. అతడికి శిక్ష పడకుండా చేసేందుకు తన పదవిని, బలాన్ని ఉపయోగిస్తాడు. తాను ఎవరినీ చంపలేదని, ఆమెకు ఏమీ గుర్తులేదని నివేదిత కోర్టుకు చెప్పినప్పుడు కథలో పెద్ద మలుపు వస్తుంది.

ఇక ఈ సినిమాలో భరత్ అనే న్యాయవాది కోర్టులో నివేదిత కేసును వాదిస్తాడు . అనుక్షణం ఊహించని మలుపులతో సాగే ఈ సినిమా క్లైమాక్స్ అద్భుతంగా ఉంటుంది. ఈ కోర్టు రూమ్ డ్రామా సినిమా కథ బలంగా ఉంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ చిత్రానికి పవన్ భట్ దర్శకత్వం వహించారు. ఈ కథను కృష్ణ అజయ్ రావు, పవన్ భట్ కలిసి రాశారు.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *