OTT Movie: ఆ హత్యలకు కారణమెవరు? ఓటీటీలోకి వచ్చేసిన ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్.. అద్దిరిపోయే ట్విస్టులు

OTT Movie: ఆ హత్యలకు కారణమెవరు? ఓటీటీలోకి వచ్చేసిన ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్.. అద్దిరిపోయే ట్విస్టులు


ప్రతివారం లాగే ఈ శుక్రవారం (ఆగస్టు 08) కూడా పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. తెలుగుతో పాటు ఇతర భాషలకు చెందిన సినిమాలు, ఆసక్తికర మైన వెబ్ సిరీస్ లు వివిధ ఓటీటీల్లోకి అందుబాటులోకి వచ్చేశాయి. ఇక ఎప్పటిలాగే సస్పెన్స్, హారర్, థ్రిల్లర్ మూవీ లవర్స్ కోసం ఒక ఆసక్తికరమైన సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇదో సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో రిలీజైన మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీ ఆడియెన్స్ ను అలరించడానికి స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఇద్దరూ స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. ఆ ఇద్దరూ తమ గర్ల్ ఫ్రెండ్స్ ను తీసుకుని చిల్ అయ్యేందుకు ఓ దట్టమైన అడవిలోకి వెళతారు. అనుకోకుండా అక్కడ ఉండే ఓ భవనంలోకి వాళ్లు అడుగు పెడతారు..
అయితే రాత్రి వేళ వాళ్లలో ఒక అమ్మాయి ఊహించని పరిస్థితుల్లో చనిపోతుంది. ఆమె ఎలా మరణించిందో మిగతా ముగ్గురికీ ఏ మాత్రం తెలియదు. కానీ ఆ అమ్మాయి శవాన్ని పక్కన పెట్టుకొని వాళ్లు ఆ భవనంలోనే ఉండిపోతారు. ఆ చావుకు తాము కారణం కాదని చెప్పడానికి ఎవరికి వాళ్లు ఒక్కో కథను అల్లుతారు. కానీ అవి వాళ్లను మరింత ప్రమాదంలోకి నెట్టేస్తాయి. మరి ఆ తర్వాత ఏం జరిగింది? భవనంలో ఎవరున్నారు? ఆ అమ్మాయిని ఎవరు, ఎందుకు చంపారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ పేరు యాధుమ్ అరియాన్. దీనికి అర్థం అతనికి ఏమీ తెలియదు అని. కొన్ని రోజుల క్రితమే తమిళంలో రిలీజైన ఈ మూవీలో తంబి రామయ్య, అప్పు కుట్టి లాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఎం.గోపీ దర్శకత్వం వహించారు. ధర్మ ప్రకాష్ మ్యూజిక్ అందించాడు. ఇప్పుడు ఈ సినిమా ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ప్రస్తుతం కేవలం తమిళ్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. మరికొన్ని రోజుల్లో తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.

ఇవి కూడా చదవండి

ఆహా తమిళ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *