OTT Movie: అప్పుడే ఓటీటీలోకి గాలి జనార్దనరెడ్డి కుమారుడి సినిమా.. శ్రీలీల డ్యాన్స్, జెనీలియా కోసమైనా చూడాల్సిందే

OTT Movie: అప్పుడే ఓటీటీలోకి గాలి జనార్దనరెడ్డి కుమారుడి సినిమా.. శ్రీలీల డ్యాన్స్, జెనీలియా కోసమైనా చూడాల్సిందే


మాజీ మంత్రి, ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరిటీ రెడ్డి హీరోగా నటించిన మొదటి సినిమా జూనియర్. దర్శకుడు రాధాకృష్ణ రెడ్డి తెరకెక్కించిన ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ లో శ్రీలీల హీరోయిన గా నటించింది. అలాగే కన్నడ నటుడు రవిచంద్రన్, జెనీలియా డిసౌజా కీలక పాత్రలు పోషించారు. జులై 18న కన్నడతో పాటు తెలుగులో ఒకేసారి విడుదలైన జూనియర్ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. ముఖ్యంగా ఇందులోని వైరల్ వయ్యారి పాట సోషల్ మీడియాను షేక్ చేసింది. శ్రీలీలతో పాటు కిరిటీ రెడ్డి వేసిన స్టెప్పులు సినిమాలో హైలెట్ గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరుగా ఆడిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆగస్ట్ 9 నుంచే ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ సినిమా ఆగస్ట్ 15 న ఓటీటీలోకి రానుందని మొదట ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఒక వారం ముందే స్ట్రీమింగ్ కు రానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

వారాహి చలన చిత్రం బ్యానర్ పై  తెరకెక్కిన ఈ సినిమాలో రావు రమేష్, సత్య, వైవా హర్ష, సుధారాణి వంటి ప్రముఖ టాలీవుడ్ నటులు యాక్ట్ చేశారు. అలాగే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించడం విశేషం. బాహుబలి’, ‘RRR’ వంటి చిత్రాలకు పనిచేసిన కె.కె. సెంథిల్ కుమార్ ‘జూనియర్’ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించారు. అలాగే పీటర్ హెయిన్స్ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించాడు.

ఇవి కూడా చదవండి

జూనియర్ సినిమాలో కిరిటీ రెడ్డి, శ్రీలీల

వైరల్ వయ్యారీ పాటకు చిన్నారి డ్యాన్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *