Onion Side Effects: ఉల్లిపాయలు తింటే ఈ రోగాలు పెరుగుతాయా? ఎవరెవరు దూరంగా ఉండాలో తెలుసా?

Onion Side Effects: ఉల్లిపాయలు తింటే ఈ రోగాలు పెరుగుతాయా? ఎవరెవరు దూరంగా ఉండాలో తెలుసా?


Onion Side Effects: ఉల్లిపాయలు తింటే ఈ రోగాలు పెరుగుతాయా? ఎవరెవరు దూరంగా ఉండాలో తెలుసా?

ఉల్లిపాయలు గుండె ఆరోగ్యానికి, మధుమేహ నియంత్రణకు మేలు చేస్తాయన్నది కాదనలేని సత్యం. ఇందులో ఉండే సల్ఫర్ సమ్మేళనాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే, ప్రతి నాణేనికి రెండు వైపులా ఉన్నట్లుగానే.. ఉల్లిపాయల వల్ల కూడా కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి. ముఖ్యంగా తీవ్రమైన జీర్ణకోశ సమస్యలు లేదా అలర్జీలు ఉన్నవారికి ఉల్లిపాయలు ఒక సవాలుగా మారుతాయి. మరి ఉల్లిపాయలను ఎవరు తినకూడదు? అది మన శరీరానికి చేసే మేలు కీడు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఉల్లిపాయల వల్ల కలిగే 5 అద్భుత ప్రయోజనాలు:

రోగనిరోధక శక్తి: ఉల్లిపాయలలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జలుబు, దగ్గు వైరల్ ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని రక్షిస్తాయి.

గుండె ఆరోగ్యం: కొలెస్ట్రాల్‌ను నియంత్రించడం ద్వారా రక్తపోటును సమతుల్యం చేస్తుంది. ఇది గుండెపోటు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

షుగర్ కంట్రోల్: మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచి రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది.

జీర్ణక్రియ: ఇందులో ఉండే ఫైబర్ అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది.

అందం: ఉల్లి రసం జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది చర్మంపై మచ్చలను తగ్గించి యవ్వనంగా ఉంచుతుంది.

ఎవరు ఉల్లిపాయలను తినకూడదు?

తీవ్రమైన కడుపు సమస్యలు: గ్యాస్ట్రిక్, అల్సర్లు లేదా తీవ్రమైన ఎసిడిటీ ఉన్నవారు పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఉల్లి అలర్జీ: కొంతమందికి ఉల్లిపాయలు పడవు, వీటిని తిన్నప్పుడు చర్మంపై దద్దుర్లు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు. అటువంటి వారు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

ప్రేగు సమస్యలు: ఐబిఎస్ (IBS) వంటి సమస్యలు ఉన్నవారికి ఉల్లిపాయలు గ్యాస్ మరియు కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తాయి.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహారంలో మార్పులు చేసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *