కేంద్ర ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ సంస్థ.. ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (OICL) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 500 క్లాస్-3 కేడర్- అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ ప్రకటన జారీ చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో 26 వరకు పోస్టులున్నాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆగస్టు 2 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్‌ఎస్‌సీ లేదా హెచ్‌ఎస్‌సీ లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీలో ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో తప్పనిసరిగా ఉత్తీర్ణత పొంది ఉండాలి. దరఖాస్తు చేసిన రాష్ట్రం లేదా యూనియన్ టెరిటరీ రీజినల్‌లో లోకల్ లాంగ్వేజ్‌లో చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా జులై 31, 2025 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆగస్టు 17, 2025వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు కింద ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/ ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్ధులు రూ.100, ఇతర వర్గాలకు చెందిన అభ్యర్ధులు రూ.850 చొప్పున చెల్లించాలి. ప్రిలిమినరీ పరీక్ష (టైర్-I), మొయిన్స్ ఎగ్జామ్ (టైర్-II), రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. టైర్ 1 ప్రిలిమినరి పరీక్ష సెప్టెంబర్ 7న, టైర్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అక్టోబరు 28న నిర్వహించనున్నారు. ఎంపికైన వారికి నెలకు రూ.22,405 నుంచి రూ.62,265 వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇవి కూడా చదవండి
పరీక్ష విధానం ఎలా ఉంటుందంటే..
ప్రిలిమినరీ రాత పరీక్ష ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ మొత్తం 100 మార్కులకు ఒక గంట సమయంలో నిర్వహిస్తారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఇందులో అర్హత సాధించిన వారికి మొయిన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ మొత్తం 250 మార్కులకు 2 గంటల సమయంపాటు నిర్వహిస్తారు. ఇంగ్లిష్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ఒరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీలో అసిస్టెంట్ పోస్టుల నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.