NZ vs PAK Prediction: కివీస్‌తో సూపర్ 8లో తొలిపోరు.. ఆ బలహీనతలే పాక్ కొంప ముంచనున్నాయా?

NZ vs PAK Prediction: కివీస్‌తో సూపర్ 8లో తొలిపోరు.. ఆ బలహీనతలే పాక్ కొంప ముంచనున్నాయా?


New Zealand vs Pakistan, 41st Match, Super 8 Group 2, ICC Men’s T20 World Cup 2026: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్–8 దశలో న్యూజిలాండ్ vs పాకిస్థాన్ (NZ vs PAK) తొలి మ్యాచ్ ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబోలో జరగనుంది. గ్రూప్–డి నుంచి న్యూజిలాండ్ 4 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 6 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు గ్రూప్–ఏలో పాకిస్థాన్ కూడా 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. ఇరు జట్లు సూపర్–8ను గెలుపుతో ఆరంభించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాయి.

ఈ క్రమంలో పిచ్ రిపోర్ట్, జట్ల తాజా ఫామ్, కీలక ఆటగాళ్లను ఓసారి చూద్దాం..

NZ vs PAK మ్యాచ్ వివరాలు..

మ్యాచ్: న్యూజిలాండ్ vs పాకిస్థాన్

వేదిక: ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో

తేదీ, సమయం: 21 ఫిబ్రవరి 2026, సాయంత్రం 7:00 గంటలు

లైవ్ స్ట్రీమింగ్: జియో హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్

హెడ్–టు–హెడ్ రికార్డు..

మొత్తం మ్యాచ్‌లు: 10

న్యూజిలాండ్ గెలిచినవి: 6

పాకిస్థాన్ గెలిచినవి: 4

టై/డ్రా: 0

గత ఐదు మ్యాచ్ ల పరిస్థితి..

న్యూజిలాండ్: W, L, W, W, W

పాకిస్థాన్: W, L, W, W, W

పిచ్ రిపోర్ట్: ఆర్. ప్రేమదాస స్టేడియం, కొలంబో..

కొలంబో పిచ్ సాధారణంగా బ్యాటింగ్, బౌలింగ్‌కు సమతుల్యంగా ఉంటుంది. ఈ మైదానంలో 160+ పరుగులు సాధిస్తే పోరాడే స్కోరుగా భావిస్తారు. స్పిన్నర్లకు మ్యాచ్ మధ్యలో సహకారం లభించే అవకాశముంది. తొలి ఇన్నింగ్స్‌లో మంచి స్కోరు సాధించిన జట్టు మ్యాచ్‌పై పట్టు సాధించవచ్చు.

NZ vs PAK మ్యాచ్ 41 – సంభావ్య ప్లేయింగ్ XI..

న్యూజిలాండ్: టిమ్ సీఫర్ట్ (వికెట్‌కీపర్), ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డెరిల్ మిచెల్ (కెప్టెన్), కోల్ మెక్‌కాన్చీ, జేమ్స్ నీషమ్, కైల్ జేమిసన్, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ.

పాకిస్థాన్: సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజమ్, ఉస్మాన్ ఖాన్ (వికెట్‌కీపర్), ఖ్వాజా నఫీ, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మిర్జా, ఉస్మాన్ తారిక్.

ఎవరు ఎక్కువ పరుగులు చేయగలరు?

సాహిబ్‌జాదా ఫర్హాన్ (పాక్): గత మ్యాచ్‌లో సెంచరీతో ఫామ్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్ జట్టుపై కూడా శుభారంభం చేయగలడు.

టిమ్ సీఫర్ట్ (న్యూజిలాండ్): 4 మ్యాచ్‌ల్లో 173 పరుగులతో ఇన్–ఫామ్ బ్యాటర్. ఈ మ్యాచ్‌లోనూ కీలకంగా మారవచ్చు.

ఎవరు ఎక్కువ వికెట్లు తీయగలరు?

ఉస్మాన్ తారిక్ (పాక్): ఇప్పటివరకు టోర్నమెంట్‌లో 8 వికెట్లతో పాక్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్.

లాకీ ఫర్గూసన్ (న్యూజిలాండ్): వేగం, వెరియేషన్లతో కీలక వికెట్లు తీయగలడు.

పైచేయి ఎవరిది..?

న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ లోతుగా ఉంది. తాజా ఫామ్ కూడా మెరుగ్గా ఉంది. పాకిస్థాన్ చిన్న జట్లపై బాగా ఆడినా, బలమైన జట్లపై బ్యాటింగ్‌లో ఒడిదుడుకులు కనిపించాయి. అందువల్ల ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ స్వల్ప ఆధిక్యంలో ఉందని అంచనా.

ఇరు జట్ల స్క్వాడ్లు (ICC T20 WC 2026)..

న్యూజిలాండ్: టిమ్ సీఫర్ట్, ఫిన్ అలెన్, రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డెరిల్ మిచెల్ (కెప్టెన్), కోల్ మెక్‌కాన్చీ, జేమ్స్ నీషమ్, కైల్ జేమిసన్, మ్యాట్ హెన్రీ, జేకబ్ డఫీ, మిచెల్ సాంట్నర్, లాకీ ఫర్గూసన్, ఇష్ సోధీ, డెవాన్ కాన్వే.

పాకిస్థాన్: సాహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ ఆఘా (కెప్టెన్), బాబర్ ఆజమ్, ఉస్మాన్ ఖాన్, ఖ్వాజా నఫీ, షాదాబ్ ఖాన్, మొహమ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మిర్జా, ఉస్మాన్ తారిక్, ఫఖర్ జమాన్, నసీమ్ షా, షాహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *