NTR : ఆనందంలో మర్చిపోయా క్షమించండి.. వీడియో రిలీజ్ చేసిన ఎన్టీఆర్

NTR : ఆనందంలో మర్చిపోయా క్షమించండి.. వీడియో రిలీజ్ చేసిన ఎన్టీఆర్


మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 14న ఈ సినిమా గ్రాండ్ గా విడుదలకానుంది. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్, పోస్టర్స్, టీజర్స్ సినిమా పై ఆసక్తి పెంచాయి. కాగా ఈ భారీ సినిమాను ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదలకానుంది వార్. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఈ క్రమంలోనే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి : నా తండ్రే నన్ను కొట్టి ఆ గాయాల పై కారం పూసేవాడు.. నోటికొచ్చినట్టు తిట్టేవాడు

ఈ ఈవెంట్ కు తారక్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. అభిమానులకు ఇబందులు కలగకుండా ఈవెంట్ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. YRF స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల విడుదల హక్కులను దక్కించుకున్నారు నిర్మాత నాగవంశీ. ఈ సినిమాను స్పెయిన్, జపాన్, అబుదాబి వంటి ప్రాంతాల్లో చిత్రీకరించారు. వార్ 2 సినిమాను రూ.210 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఇది కూడా చదవండి : అలాంటి సీన్ చేసి ఇంటికెళ్లి ఏడ్చా.. ఇప్పటికీ బాధగానే ఉంది.. ఇన్నాళ్లకు అసలు విషయం బయట పెట్టిన సదా

ఇక నిన్న ఈవెంట్ లో తారక్ , హృతిన్ అదరగొట్టారు. బ్లాక్ అండ్ బ్లాక్ గెటప్స్ లో దుమ్మురేపాడు. అలాగే తారక్ స్పీచ్ అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఈవెంట్ లో తారక్ మాట్లాడుతూ.. 13 ఏళ్ల క్రితం బాద్షా ఈవెంట్ సమయంలో వరంగల్ లో తొక్కిసలాటలో ఓ అభిమాని చనిపోవడం నన్ను ఎంతో బాధపెట్టింది. అందుకే నేను పబ్లిక్ ఈవెంట్స్ అంటే భయపడతాను. వార్ 2 నేను చేయడానికి కారణం ఆదిత్య చోప్రా. ఈ సినిమా నువ్వు చేయాలి. మీ అభిమానులు గర్వపడేలా ఈ సినిమాను తీస్తానుఅని చెప్పి.. నాకు ఈ సినిమా చేసేందుకు భరోసా ఇచ్చిన ఆదిత్య చోప్రా గారికి థాంక్స్ అంటూ తారక్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ ఓ వీడియో విడుదల చేశారు. సినిమా గురించి, అభిమానుల గురించి మాట్లాడుతూ ఆనందంలో తెలంగాణ ప్రభుత్వం గురించి , పోలీసుల సహకారం గురించి మాట్లాడటం మర్చిపోయా.. క్షమించండి అని అన్నాడు “తారక్. ఈవెంట్ లో నేను ఓ ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. నన్ను క్షమించాలి. నా పాతిక సంవత్సరాల జర్నీని అభిమానులతో పంచుకునే ఆనందంలో ఈ తప్పిదం జరిగింది. వార్ 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌ సక్సెస్ చేయడంలో సహకరించిన తెలంగాణ ప్రభుత్వానికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అలాగే తెలంగాణ పోలీస్ శాఖకు నా హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నాడు ఎన్టీఆర్.

ఇది కూడా చదవండి : ఏం సినిమా రా అయ్యా..! థియేటర్స్‌లో డిజాస్టర్..11ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న సినిమా..

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *