ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా ఏడాది పాటు అమలు చేయనున్నారు. అక్రమ వలసలను అరికట్టడంతో పాటు, వీసా గడువు ముగిసినా దేశం విడిచి వెళ్లని వారిని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్ గతంలో జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల ఆధారంగా ఈ పైలట్ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ రూల్స్‌ను..ఆగస్టు 5న ఫెడరల్ రిజిస్టర్లో అధికారికంగా ప్రకటించి, 15 రోజుల తర్వాత అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 2026 వరకు కొనసాగుతుంది. అయితే, అన్ని దేశాల వారికీ ఈ నిబంధనలు వర్తించవని, ఏ ఏ దేశాల వారికి ఈ రూల్స్ వర్తిస్తాయనే విషయం.. త్వరలోనే తాము ప్రకటిస్తామని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. దరఖాస్తుదారుడి నేపథ్యాన్ని బట్టి బాండ్ అవసరమా? లేదా? అనేది కాన్సులర్ అధికారులు నిర్ణయిస్తారు. బాండ్ మొత్తాన్ని కూడా వారే నిర్ధారిస్తారు. వీసా మినహాయింపు కార్యక్రమం కింద ప్రయాణించే వారికి ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేశారు. ఈ బాండ్ విధానం కింద జారీ చేసే వీసా కింద.. ఒక మనిషినే అనుమతిస్తారు. ఈ వీసా జారీ అయిన నాటి నుంచి 3నెలల వరకు అమెరికాలో ఉండే వీలుంటుంది. ప్రయాణికులు వీసా నిబంధనలను పూర్తిగా పాటించి, సరైన సమయంలోగా దేశం విడిచి వెళితే.. వారు చెల్లించిన బాండ్ మొత్తాన్ని పూర్తిగా తిరిగి వాపసు చేస్తామని అధికారులు వివరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Coolie: కూలీ నెం 1421.. రజనీ పట్టుకున్న ఈ బ్యాడ్జీ నంబర్ వెనుక
ఊరంతా మొసళ్ల పండుగ ఎక్కడో తెలుసా..
ప్రైవేట్ ట్యాక్సీలకు పోటీగా త్వరలో భారత్ ట్యాక్సీలు
3 కోట్లు పెడితే.. 40 కోట్లు వసూల్.. ఆగస్టు 8న తెలుగులో రిలీజ్
ఆహారం తింటున్న సింహాన్ని వీడియో తియ్యాలనుకున్నాడు.. అంతే