ఈ మార్పుల ద్వారా బీమా లేకుండా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలకు కేంద్రం రెడీ అవుతోంది. ఇప్పటివరకు రోడ్డు మీద ఇన్సూరెన్స్ లేని వెహికిల్ దొరకితే.. మొదటిసారి రూ. 2,000, రెండవసారి రూ. 4,000 ఫైన్ వేస్తున్నారు. ఇకపై, మొదటి సారి ఇన్సూరెన్స్ లేకుండా బండి నడిపితే… బీమా ప్రీమియం మొత్తానికి 3 రెట్లు వసూలు చేయాలని కేంద్రం భావిస్తోంది. అప్పటికీ బీమా తీసుకోకుండా.. రెండో సారి దొరికితే.. వారి నుంచి ప్రీమియం మొత్తానికి 5 రెట్లు వసూలు చేయనున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, డ్రంకన్ డ్రైవ్ విషయంలో కూడా కొత్త రూల్స్ రాబోతున్నాయి.అతివేగం లేదా మద్యం తాగి వాహనం నడిపితే.. వారికి ఇప్పుడున్న దానికి 10 రెట్లు జరిమానాలు వేసే దిశగా కేంద్రం ఆలోచిస్తోంది. అలాగే, వారందరూ మళ్ళీ లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవటానికి డ్రైవింగ్ పరీక్ష రాయాలనే రూల్ తీసుకురానున్నారు. అలాగే, 55 ఏళ్లు నిండిన వారు.. మళ్లీ డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష రాయాలి. అలాగే, టెస్ట్ డ్రైవ్ చేయాల్సిందే. కొత్త రూల్స్ ప్రకారం.. నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో స్పీడ్ కంట్రోల్ ను నిర్ణయించే హక్కు ఇకపై.. కేంద్రం నిర్ణయించనుంది. అయితే రాష్ట్ర రహదారులు, స్థానిక రోడ్ల మీద వేగం పరిధిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి. ఈ మార్పులను ప్రతిపాదించిన కేంద్రం, దీనిపై పలు రాష్ట్రాల అభిప్రాయాలు సేకరిస్తోంది. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఇతర మంత్రిత్వ శాఖల అభిప్రాయాలు రాగానే వాటిని మంత్రివర్గానికి పంపుతారు. మంత్రివర్గం ఆమోదించిన వెంటనే ఈ కొత్త నియమాలు దేశవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఇక నుంచి మీరు వాహనం నడుపుతుంటే ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ముఖ్యంగా బీమా, వేగ పరిమితి, లైసెన్స్ విషయంలో అప్రమత్తంగా లేకపోతే భారీ జరిమానా చెల్లించాల్సి రావచ్చు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గుడ్‌న్యూస్.. వచ్చే నెలనుంచే వందేభారత్ తొలి స్లీపర్ రైలు
Python: రెండు కొండ చిలువలు కలబడితే ఎట్లుంటదో తెలుసా?
సునామీని సైతం అడ్డుకునే అడవులివే! ఏపీ, తెలంగాణ నుంచి పర్యాటకుల క్యూ
ఒక్క ఫోన్‌తో జీవితం ఛిన్నాభిన్నం
ఫుల్‌గా మందు కొట్టాడ.. కారును రైల్వే ప్లాట్‌ఫామ్ పై పార్క్ చేసాడు.. అదే కదా మ్యాజిక్కు