NEP vs ENG: తొలి బంతికే వికెట్.. చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్..

NEP vs ENG: తొలి బంతికే వికెట్.. చరిత్ర సృష్టించిన నేపాల్ బౌలర్..


Sher Malla First Ball Wicket: డెబ్యూ మ్యాచ్ ఆడిన షేర్ మల్లా, నేపాల్‌కు చాలా కాలం పాటు గుర్తుండిపోయే ఒక అద్భుత క్షణాన్ని అందించాడు. ప్రపంచంలోని అత్యంత బలమైన జట్లలో ఒకటైన ఇంగ్లాండ్ జట్టుతో ఆడూతూ.. అది కూడా అతిపెద్ద వేదికపై బరిలోకి దిగి, తన అంతర్జాతీయ కెరీర్‌కు డ్రీమ్ ఆరంభాన్ని ఇచ్చాడు. పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అతను వేసిన తొలి బంతికే వికెట్ పడింది. అది ఏదో సాధారణ వికెట్ కాదు.. వాంఖడే స్టేడియంలో గర్జిస్తోన్న ఫిల్ సాల్ట్ వికెట్‌ను పడగొట్టాడు. దీంతో పాటు అరుదైన రికార్డును కూడా సృష్టించాడు.

షేర్ మల్లా సాధించిన అరుదైన ఏంటంటే?

టీ20ఐ క్రికెట్‌లో తొలి బంతికే వికెట్ తీయడం చాలా అరుదు. అదే పురుషుల టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లో చేయడం మరింత అరుదైన విషయం. షేర్ మల్లా కంటే ముందు వరల్డ్‌కప్ మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన వారు కేవలం ఐదుగురే. ఈ లిస్ట్ లో ఫిడెల్ ఎడ్వర్డ్స్, ప్రజ్ఞాన్ ఓజా, పరాస్ ఖడ్కా, నదీమ్ అహ్మద్, ఖుర్రం ఖాన్.. ఇప్పుడు షేర్ మల్లా కూడా ఆ ప్రతిష్టాత్మక జాబితాలో చేరాడు.

తొలి బంతికే వికెట్ తీసిన నేపాల్ ఆటగాళ్లు (పురుషుల టీ20ఐలు):

పరాస్ ఖడ్కా

ఆరిఫ్ షేక్

కుషాల్ భూర్తేల్

షేర్ మల్లా.

నేపాల్‌కు ఈ ఘనతకు మరింత ప్రత్యేకమైన విలువ ఉంది. పరాస్ ఖడ్కా, ఆరిఫ్ షేక్, కుషాల్ భూర్తేల్, ఇప్పుడు షేర్ మల్లా.. ఇలా ఈ నలుగురూ పురుషుల టీ20ఐల్లో తమ తొలి బంతికే వికెట్ తీసిన ఆటగాళ్లే. అది ఫుల్ లెంగ్త్‌లో వచ్చి స్టంప్స్ వైపు లోపలికి స్వింగ్ అయింది. ఫిల్ సాల్ట్ తొందరపడి భారీ షాట్‌కు ప్రయత్నించాడు. బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తాకి షార్ట్ ఫైన్ లెగ్ వైపు ఎగిరింది. సందీప్ లామిచ్ఛానే చాలా కూల్ గా క్యాచ్‌ను పూర్తి చేశాడు. ఒక్క బంతి, ఒక్క వికెట్ తో చరిత్ర సృష్టించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *