Nalgonda Corporation Result: నల్గొండలో కాంగ్రెస్ ప్రభంజనం.. కార్పొరేషన్‌తో పాటు 6 మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్..

Nalgonda Corporation Result: నల్గొండలో కాంగ్రెస్ ప్రభంజనం.. కార్పొరేషన్‌తో పాటు 6 మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్..


తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని మరోసారి రుజువు అయ్యింది. జిల్లాలోని ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుని కాంగ్రెస్ ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా భారీ మెజారిటీతో పీఠాన్ని మేయర్ దక్కించుకుంది.

నల్గొండ కార్పొరేషన్‌లో ఏకపక్ష విజయం

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మొత్తం 48 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అద్భుత ప్రదర్శన కనబరిచింది. కాంగ్రెస్ 35 స్థానాలతో అదరగొట్టగా.. బీఆర్ఎస్ 10 స్థానాలు, బీజేపీ 02, స్వతంత్రులు ఒక స్థానంలో విజయం సాధించారు. ఈ విజయంతో కార్పొరేషన్ పీఠంపై హస్తం పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమైంది.

జిల్లా వ్యాప్తంగా హస్తం హవా..

నల్గొండ జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ జైత్రయాత్ర కొనసాగింది. చండూరు నుంచి నందికొండ వరకు అన్ని చోట్లా ప్రత్యర్థులు కనీస పోటీ ఇవ్వలేకపోయారు. మిర్యాలగూడ, దేవరకొండ, చిట్యాల, హాలియా, నందికొండ, చండూరు కాంగ్రెస్ సత్తా చాటింది. ప్రధానంగా హాలియా, నందికొండ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. 12 వార్డులకు గాను రెండింటిలోనూ చెరో 11 స్థానాలను దక్కించుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. అతిపెద్ద మున్సిపాలిటీ అయిన మిర్యాలగూడలో 31 స్థానాలతో స్పష్టమైన మెజారిటీ సాధించింది.

కాగా నల్గొండ జిల్లా ఫలితాలు కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అభివృద్ధి మంత్రం, ప్రభుత్వ పథకాలే తమను గెలిపించాయని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీలు కొన్ని స్థానాలకే పరిమితం కావడం గమనార్హం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *