Nagarjuna : ధురంధర్‏లో విలన్ ఛాన్స్ పై నాగార్జున కామెంట్స్.. అసలు ఏమన్నారంటే..

Nagarjuna : ధురంధర్‏లో విలన్ ఛాన్స్ పై నాగార్జున కామెంట్స్.. అసలు ఏమన్నారంటే..


టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ కాకుండా నిత్యం ప్రయోగాత్మక చిత్రాలతో మెప్పిస్తున్నారు. ఇన్నాళ్లు హీరోగా అలరించిన నాగ్ ఇప్పుడు విలన్ పాత్రలలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆరు పదుల వయసులోనూ ఏమాత్రం తరగని అందం, ఫిట్నెస్ లుక్స్ తోపాటు.. అటు బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో రాణిస్తున్నారు. అయితే ఇటీవల కొన్ని రోజులుగా నాగార్జునకు సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఆయనకు బాలీవుడ్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ధురంధర్ సినిమాలో ఛాన్స్ వచ్చిందని.. కానీ ఆయన దానిని వదులుకున్నారనే వార్తలు వినిపించాయి.

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్స్ పై స్పందించారు నాగ్. అక్షయ్ ఖన్నా పాత్రను మీకు ఆఫర్ చేశారట నిజమేనా ? అని అడగ్గా.. అలాంటిదేమి లేదు. నాకు ఎవరూ ఏ పాత్ర చేయమని అడగలేదు. అయితే ధురంధర్ మూవీ సూపర్ హిట్. ఆదిత్యధర్ అద్భుతంగా తెరకెక్కించారు. ఆయన తీసిన ఉరి సినిమా కూడా ఇష్టమే. ధురంధర్ చిత్రంలో అందరూ ఎంతో చక్కగా నటించారు. అక్షయ్ ఖన్నా నటన సినిమాకు ప్రధాన బలం. సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అని అన్నారు. ప్రస్తుతం నాగార్జున చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

ధురంధర్ సినిమాలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో రెహమాన్ డెకాయిత్ పాత్రలో అక్షయ్ ఖన్నా యాక్టింగ్ అందుకుంది. నాగ్ 100వ గురించి అడగ్గా మేమేమి తొందరపడడం లేదు.. సినిమా తొందరగా పూర్తి చేయాలనే ఆలోచన లేదు అంటూ చెప్పుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *