Naga Chaitanya: నాగ చైతన్యతో.. గంగూలీ, జాన్‌ అబ్రహాం ఢీ అంటే ఢీ.. ఇంతకీ గెలిచేది ఎవరో

Naga Chaitanya: నాగ చైతన్యతో.. గంగూలీ, జాన్‌ అబ్రహాం ఢీ అంటే ఢీ.. ఇంతకీ గెలిచేది ఎవరో


ఇప్పుడు సినిమా స్టార్లు.. స్పోర్ట్స్‌లో సత్తా చాటుతున్నారు. తమకు సినిమాల్లో వచ్చిన డబ్బుతో… ఏదైనా క్రీడా రంగంలోని ఓ జట్టును కొనుగోలు చేసి.. స్పోర్ట్స్‌ ఫీల్డ్‌లో దూసుకుపోతున్నారు. ఇక రేస్‌లంటే అమితాసక్తి చూపించే నాగ చైతన్య.. రేసింగ్‌లో పోటీపడుతున్నాడు. ఏకంగా జాన్ అబ్రహాం, క్రికెటర్ సౌరవ్ గంగూలీ మీదికే కాలు దువ్వుతున్నాడు. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌. ఫార్ములా వన్‌ కార్ల తరహాలో సింగిల్‌ సీటింగ్‌తో తయారైన కార్లతో ప్రత్యేకంగా నిర్వహించే అంతర్జాతీయ మోటార్‌ స్పోర్ట్‌ ఇది.తొలిసారి మన దేశంలో జరుగుతున్న ఈ ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ లో మొత్తం 6 టీమ్స్‌ పోటీపడుతున్నాయి. ఈ టీమ్స్‌కు పలువురు సినీ తారలు సారధ్యం వహిస్తున్నారు.ఈ పోటీలో టాలీవుడ్‌ టాప్‌ హీరో నాగ చైతన్య హైదరాబాద్‌ బ్లాక్‌ బర్డ్స్‌ టీమ్‌కు సారధిగా ఉన్నాడు. తొలి నుంచీ రేసింగ్‌ అంటే ఇష్టం చూపించే నాగ చైతన్య అదే క్రమంలో స్థానిక టీమ్‌ను దక్కించుకున్నాడు. నాగ చైతన్యకు పోటీగా.. గోవా తరపున జాన్ అబ్రహాం.. ఏసెస్ JA రేసింగ్, బెంగుళూరు తరపున కిచ్చాస్ కింగ్స్, కోల్‌కతా తరపున గంగూలీ రాయల్ టైగర్స్‌.. ఢిల్లీ తరుపున అర్జున్ కపూర్స్ స్పీడ్ డెమన్స్‌, చెన్నై టర్బో రైడర్స్ ఈ IRl ఢీకొనబోతున్నాయి. దీంతో ఈ రేసింగ్ పోటీలు ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌గా మారాయి. అందరూ ఓ లుక్కేసేలా చేసుకుంటున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Varanasi: వారణాసిలో ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ రివీల్.. మంచి ఛాన్స్ కొట్టేశాడుగా

ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు

పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..

సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి

తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?

Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్‌ అధికారులకు పట్టించిన ఆవు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *