Naga Chaitanya: ఆ హీరోయిన్ అంటే నాకు వణుకు.. షాకింగ్ విషయం చెప్పిన నాగ చైతన్య

Naga Chaitanya: ఆ హీరోయిన్ అంటే నాకు వణుకు.. షాకింగ్ విషయం చెప్పిన నాగ చైతన్య


అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య ఇటీవలే పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య శోభితతో ప్రేమలో పడిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు రీసెంట్ గా పెళ్లి పీటలెక్కారు. సామ్ తో విడిపోయిన తరువాత నాగ చైతన్య వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. అటు సామ్ ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు వరుసగా సినిమాల్లో నటించడానికి రెడీ అవుతుంది. కాగా నాగ చైతన్య, శోభిత వివాహం డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్ లో కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరిగింది. ఇక చై సినిమాల విషయానికొస్తే ఇటీవలే తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ సినిమా బ్లక్ బస్టర్ గా నిలిచింది.

ఓ హీరోయిన్ అంటే తనకు వణుకు వస్తుందని తెలిపాడు నాగచైతన్య ఆమె ఎవరో తెలుసా.? నాగ చైతన్య మొన్నామధ్య రానా దగ్గుబాటి హోస్ట్ గా చేస్తున్న ఓ టాక్ షోకు గెస్ట్ గా హాజరయ్యాడు. ఈ షోలో రానా ఫ్యామిలీ మెంబర్స్ హాజరయ్యారు. ఈ టాక్ షోలో నాగ చైతన్య పలు సరదా ముచ్చట్లు పంచుకున్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ.. ఓ హీరోయిన్ అంటే తనకు వణుకు అని చెప్పాడు.. ఆ హీరోయిన్ ఎవరో కాదు. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి.

ఇవి కూడా చదవండి

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి టాలీవుడ్ లో లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. తన నటనతో అందంతో ఈ అమ్మడు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కాగా నాగచైతన్య తో ఈ చిన్నది లవ్ స్టోరీ సినిమా చేసింది. ఇక రీసెంట్ గా తండేల్ సినిమాతో మరో హిట్ సొంతం చేసుకుంది. రానా షోలో చైతన్య మాట్లాడుతూ.. సాయి పల్లవితో నటించాలన్నా, డాన్స్ చేయాలన్నా తనకు వణుకు అని తెలిపాడు. అలాగే రానాతో మాట్లాడుతూ.. నువ్వు కూడా సాయి పల్లవితో సినిమా చేశావ్.. కానీ డాన్స్ చేయకుండా తప్పించుకున్నావ్ అని అన్నాడు చై. ఆ తర్వాత చైతన్య సాయి పల్లవికి ఫోన్ చేసి ఆటపట్టించారు. సెట్ లో దర్శకుడిని టార్చర్ చేస్తుంది అంటూ ఆమెను ఆటపట్టించారు రానా, నాగ చైతన్య.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *