My CURE App: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఇక పౌర సేవలు మరింత సులభం.. జీహెచ్ఎంసీ కొత్త యాప్!

My CURE App: హైదరాబాదీలకు గుడ్‌న్యూస్.. ఇక పౌర సేవలు మరింత సులభం.. జీహెచ్ఎంసీ కొత్త యాప్!


నగరవాసులకు మెరుగైన సేవలను అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎప్పికప్పుడూ కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తూనే ఉంది. తాజాగా పౌర సేవలను మరింత సులభతరం, వేగవంతం చేసేందుకు గతంలో ఉన్న ‘MyGHMC’ యాప్‌ను అప్‌గ్రేడ్ చేసి అత్యాధునిక ఫీచర్లతో మైక్యూర్ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సమాన్యులు కూడా ఈజీగా అర్థం చేసుకునేలా ఈ కొత్త యాప్ ఇంటర్‌ఫేస్‌ను మార్చారు. అంతేకాదు గతంలో లా ఒక్కో సమస్యకు ఒక్కో ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. అన్ని ఫిర్యాదులను ఇందులోనే నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ సదుపాయం వల్ల నగరవాసులు ఎక్కడి నుంచైనా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు.

ఈ యాప్‌ను అప్‌గ్రేడ్ వెనక ఉన్న ప్రదాన ఉద్దేశం ఏమిటంటే పారదర్శకమైన సేవ, జవాబుదారీతనాన్ని పెంచడం. ఈ యాప్‌లో తమ సమస్యపై ఫిర్యాదు చేసిన వినియోగదారులు.. తమ ఫిర్యాదు ఏదశలో ఉందనే విషయాన్ని రియల్‌ టైంలో ట్రాక్ చేసుకోవచ్చు. మీరు ఈ యాప్‌లో ఫిర్యాదు చేసిన వెంటనే అది సంబంధిత అధికారులకు చేరుతుంది. దాన్ని పరిగణలోకి తీసుకొని అధికారులు పరిష్కారం చూపి దాన్ని యాప్‌లో అప్‌డేట్ చేయడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుంది. అలాగే క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారంలో జరుగతున్న జాప్యం తగ్గుతుంది.

ఈ యాప్‌ ఆండ్రాయిడ్, iOS రెండింటి సపోర్ట్ చేస్తుందని.. నగరవాసులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని జీహెచ్ఎంసీ పేర్కొంది. ఈ యాప్‌ ద్వారా కేవలం ఫిర్యాదు చేసుకోవడం మాత్రమే కాకుండా వాతావరణ హెచ్యరికలు, మీ వార్డు ఆఫీస్‌లు, ఆఫీసర్లు ఎక్కడున్నారనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. అంతేకాదు ఇంటి పన్నులు, ట్రేడ్ లైసెన్స్, జనన, మరణ దృవపత్రాల సేవలు కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉండనున్నాయి. నగరవాసులంతా ఈ సేవలను వినియోగించుకోవాలని జీహెచ్‌ఎంసీ కోరింది

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *