Municipal Election Results: పెరిగిన పోలింగ్ శాతం.. కలిసొస్తుందని లెక్కలేసుకుంటున్న పార్టీలు

Municipal Election Results: పెరిగిన పోలింగ్ శాతం.. కలిసొస్తుందని లెక్కలేసుకుంటున్న పార్టీలు


ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం కూడా కౌంటింగ్‌పై ఆసక్తి పెరగడానికి మరో కారణం. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మొత్తంగా 70.26 శాతం పోలింగ్ నమోదుకాగా.. ఇప్పుడు 73.01 శాతం ఓటింగ్ నమోదైంది. ఏడు కార్పొరేషన్లలో 66.05 శాతం పోలింగ్ నమోదైంది. 116 మున్సిపాలిటీల్లో 75.88 శాతం పోలింగ్ రికార్డ్ అయ్యింది. అత్యథికంగా చౌటుప్పల్‌లో 91.91 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా 59.68 శాతం నందికొండ మున్సిపాలిటీలో నమోదైంది. ఇక కార్పొరేషన్లలో నల్గొండలో అత్యధిక పోలింగ్ నమోదైంది. నిజామాబాద్‌లో అత్యల్పంగా పోలింగ్ రికార్డ్ అయ్యింది.

పెరిగిన పోలింగ్ శాతం తమకే కలిసొస్తుందని పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. పంచాయతీ ఎన్నికల తరహాలోనే ఇక్కడ కూడా తామే అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని.. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనూ ఎక్కువ శాతం తామే విజయం సాధిస్తామని కాంగ్రెస్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు తాము అనుకున్న దానికంటే మెరుగైన ఫలితాలు వస్తాయని బీజేపీ, బీఆర్ఎస్ కూడా భావిస్తున్నాయి. అయితే చాలా చోట్ల అన్ని పార్టీల అభ్యర్థులు, పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు పోల్ మేనేజ్‌మెంట్‌పై ఫోకస్ చేయడంతో ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. దీంతో ఓట్ల లెక్కింపుపై పార్టీలతో పాటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది.

ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలని మూడు ప్రధాన పార్టీలు గట్టిగానే పని చేశాయి. చాలా చోట్ల బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాయి. ముఖ్యనేతలు పలు చోట్ల ఇంఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారు. దీంతో బరిలో నిలిచిన అభ్యర్థులంతా దాదాపు ప్రతి ఒక్క ఓటరుతో టచ్‌లోకి వెళ్లారు. తమకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కారణంగానే గతంతో పోలిస్తే ఈసారి మరింత ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైనట్టు స్పష్టమవుతోంది. పెరిగిన ఓటింగ్ శాతం తమకే కలిసొస్తుందని అన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నా.. ఫైనల్‌గా అది ఎవరికి అడ్వాంటేజ్ అవుతుందన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది.

మున్సిపల్ ఎన్నికల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *