Most Expensive Rice: వార్నీ.. కేజీ కొనాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే!.. గిన్నిస్ రికార్డుకెక్కిన ఈ రైస్ ఎందికింత కాస్ట్లీ?

Most Expensive Rice: వార్నీ.. కేజీ కొనాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే!.. గిన్నిస్ రికార్డుకెక్కిన ఈ రైస్ ఎందికింత కాస్ట్లీ?


Most Expensive Rice: వార్నీ.. కేజీ కొనాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే!.. గిన్నిస్ రికార్డుకెక్కిన ఈ రైస్ ఎందికింత కాస్ట్లీ?

జపాన్‌లోని ‘తోయో రైస్ కార్పొరేషన్’ ఈ ఖరీదైన బియ్యాన్ని ఉత్పత్తి చేస్తోంది. 2016లోనే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యంగా గుర్తింపు పొందింది. కిలో బియ్యం ధర మార్కెట్‌ను బట్టి రూ. 12,500 నుండి రూ. 15,000 వరకు పలుకుతోంది. కేవలం ధర మాత్రమే కాదు, దీనిని పండించే విధానం, ప్రాసెసింగ్ చేసే పద్ధతి కూడా ఎంతో విలక్షణంగా ఉంటుంది. ఈ ఖరీదైన బియ్యం వెనుక ఉన్న అసలు రహస్యాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఎందుకు ఈ బియ్యం అంత ఖరీదు?

అరుదైన మిశ్రమం: ఇది ఏదో ఒక రకమైన బియ్యం కాదు. జపాన్‌లోని గున్మా, నాగనో, నీగాటా వంటి ప్రాంతాల్లో పండే కోషిహికారి, పికామారు వంటి ఐదు రకాల మేలైన బియ్యం రకాలను కలిపి దీనిని తయారు చేస్తారు.

ఆరు నెలల నిరీక్షణ: బియ్యం కోత కోసిన వెంటనే మార్కెట్లోకి రావు. వీటిని దాదాపు ఆరు నెలల పాటు నిల్వ చేస్తారు (Aged). ఇలా చేయడం వల్ల బియ్యం రుచి, ఆకృతి మెరుగుపడుతుందని కంపెనీ చెబుతోంది.

ప్రత్యేక పాలిష్ విధానం: దీని కోసం పేటెంట్ పొందిన ప్రత్యేక ‘బఫింగ్’ ప్రక్రియను ఉపయోగిస్తారు. బియ్యం పైపొరను తొలగించినప్పటికీ, అందులోని పోషకాలు పోకుండా ఈ పద్ధతి కాపాడుతుంది.

అద్భుతమైన రుచి: ఈ బియ్యంతో అన్నం వండితే అది స్పటికాల్లా మెరుస్తుంది. దీని రుచి కొంచెం తియ్యగా, వెన్నలాగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉంటుందని భోజన ప్రియులు చెబుతుంటారు.

లగ్జరీ గిఫ్ట్‌గా ప్రాచుర్యం: తోయో రైస్ కార్పొరేషన్ ఏడాదికి కేవలం 1,000 బాక్సులను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. జపాన్‌లో దీనిని ప్రతిరోజూ తినే ఆహారంలా కాకుండా, అత్యంత ఖరీదైన కానుకగా ఇతరులకు ఇస్తుంటారు. ఒక సాధారణ ఆహార పదార్థం కూడా సరైన నైపుణ్యం తోడైతే ఎలా గిన్నిస్ రికార్డు సృష్టిస్తుందో చెప్పడానికి కిన్మెమాయ్ ప్రీమియం ఒక నిదర్శనం.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఈ బియ్యం ధర అంతర్జాతీయ మార్కెట్ , ఎక్స్ఛేంజ్ రేట్లపై ఆధారపడి మారుతూ ఉండవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *