Money Astrology: మరో రెండు మాసాల్లో.. వారికి ఆర్థిక సమస్యలు ఫసక్..! ఇందులో మీ రాశి ఉందా?

Money Astrology: మరో రెండు మాసాల్లో.. వారికి ఆర్థిక సమస్యలు ఫసక్..! ఇందులో మీ రాశి ఉందా?


మరో రెండు నెలల్లో ఆదాయం బాగా పెరగడానికి, అప్పులు తీరిపోవడానికి కొన్ని రాశుల వారికి బాగా అవకాశం ఉంది. ప్రస్తుత గ్రహ సంచారంలో లాభాధిపతి లేదా లాభ స్థానం ఏ రాశులకు బలంగా ఉంటే ఆ రాశుల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. లాభాధిపతి బలంగా, అనుకూలంగా ఉంటే ఆ రాశివారికి సునాయాసంగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ప్రస్తుత గోచారం ప్రకారం మేషం, వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకర రాశులకు లాభాధిపతి బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరికి ఇక నుంచి ఆదాయం బాగా పెరిగి, మార్చి నెలాఖరు లోపల ఆర్థిక సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్లు చాలావరకు పరిష్కారం అవుతాయి.

  1. మేషం: ఈ రాశివారికి లాభ స్థానంలో మార్చి నెలాఖరు వరకు రాశ్యధిపతి కుజుడితో సహా నాలుగు గ్రహాల సంచారం జరుగుతున్నందు వల్ల ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందడం జరుగుతాయి. సంపన్నుడు అవడానికి అవకాశం ఉంది.
  2. వృషభం: ఈ రాశికి అత్యంత శుభుడైన శనీశ్వరుడు లాభ స్థానంలో పటిష్ఠంగా ఉన్నందువల్ల ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. ఉద్యోగంలో జీత భత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాల్ని మించడం వంటివి జరుగుతాయి. ఫలితంగా అప్పులు, ఆర్థిక సమస్యల నుంచి మరో రెండు నెలల్లో పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. మార్చి తర్వాత వీరికి అప్పులుండే అవకాశం లేదు.
  3. కర్కాటకం: ఈ రాశికి లాభాధిపతి అయిన శుక్రుడు మార్చి 2 నుంచి భాగ్యస్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరిగి, ఆర్థిక సమస్యలు తగ్గడం ప్రారంభమవుతుంది. ఈ రాశివారు ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అందడంతో పాటు బాకీలు, బకాయిలు వసూలవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విశేషంగా లాభిస్తాయి. ఉద్యోగంలో జీతాలు పెరిగే అవకాశం ఉంది.
  4. సింహం: ఈ రాశికి లాభ స్థానంలో ధన కారకుడైన గురువు సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. రెండు నెలల్లో అంచనాల్ని మించి ఆదాయం బాగా పెరగడం వల్ల వీరు ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు బయటపడే అవ కాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆర్థికంగా ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. అన్ని రకాల ఆర్థిక ఒత్తిళ్లు తగ్గిపోయి, మానసిక ప్రశాంతత లభిస్తుంది.
  5. వృశ్చికం: ఈ రాశికి లాభాధిపతి అయిన బుధుడు మరో రెండు నెలల పాటు చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. రావలసిన సొమ్ము, రాదనుకున్న సొమ్ము చేతికి అందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఒకటి రెండు సార్లు ధన యోగాలు పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. ఈ రాశివారు ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడే అవకాశం ఉంది.
  6. మకరం: ఈ రాశికి లాభాధిపతి అయిన కుజుడు ఈ నెల 23 నుంచి మార్చి ఆఖరు వరకు ధన స్థానంలో సంచారం చేయడం వల్ల కొద్ది ప్రయత్నంతో ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. రావలసిన సొమ్ము చేతికి అందడం, బాకీలు, బకాయిలు వసూలు కావడం, ఆస్తి మూలంగా ఆదాయం లభించడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. మార్చి తర్వాత వీరికి ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు ఉండే అవకాశం లేదు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *