Mohammed Siraj : టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల వచ్చిన పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది. సిరాజ్, గాయని ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లే మధ్య లవ్ స్టోరీ నడుస్తోందంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. అయితే, రాఖీ పండుగ సందర్భంగా జనై భోస్లే సిరాజ్‌కు రాఖీ కట్టిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది. ఇంగ్లండ్ పర్యటన తర్వాత భారత క్రికెటర్లు అందరూ ఇంటికి చేరుకున్నారు. దీంతో రాఖీ పండుగను కుటుంబ సభ్యులతో జరుపుకునే అవకాశం లభించింది. ఈ నేపథ్యంలో, టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ తన సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోలో గాయని ఆశా భోస్లే మనవరాలు జనై భోస్లే, సిరాజ్‌కు రాఖీ కట్టడం చూడవచ్చు.
గత కొంతకాలంగా జనై భోస్లే, మహ్మద్ సిరాజ్‌ల మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని సోషల్ మీడియాలో అనేక పుకార్లు వచ్చాయి. వారిద్దరు కలిసి ఉన్న ఒక ఫోటో కూడా వైరల్ అయింది. జనై భోస్లే ఐపీఎల్ మ్యాచ్‌లలో సిరాజ్‌కు మద్దతుగా మైదానానికి రావడం కూడా ఈ పుకార్లకు మరింత బలం చేకూర్చింది. అయితే, జనై భోస్లే తన సోషల్ మీడియాలో సిరాజ్‌కు రాఖీ కట్టిన వీడియోను పోస్ట్ చేసి, “అందరిలో ఇంతకంటే గొప్పది నేను కోరుకోలేదు” అని రాసింది. ఈ వీడియోతో పాటు గతంలో కూడా జనై సిరాజ్‌తో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ, “నా ప్రియమైన అన్నయ్య” అని సంబోధించింది. అప్పుడు సిరాజ్ కూడా “నా చెల్లి లాంటి వారు ఎవరూ లేరు” అని సమాధానమిచ్చాడు. దీంతో వారిద్దరి మధ్య ఉన్నది బ్రదర్ సిస్టర్ రిలేషన్ అని తేటతెల్లం అయింది.
మహ్మద్ సిరాజ్ టీ20లలో తక్కువ అవకాశాలు పొందుతున్నాడు. అతను చివరి టీ20 మ్యాచ్ జూలై 2024లో ఆడాడు. అయితే, ఇంగ్లండ్ పర్యటనలో సిరాజ్ అద్భుతంగా రాణించాడు. ఐదు టెస్టుల్లో మొత్తం 23 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శన కారణంగా రాబోయే ఆసియా కప్ టోర్నమెంట్‌కు సిరాజ్‌ను సెలక్ట్ చేయవచ్చని భావిస్తున్నారు. ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో జరగనుంది. భారత్ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో, రెండో మ్యాచ్‌ను సెప్టెంబర్ 14న పాకిస్థాన్‌తో ఆడనుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..