Mohammed Siraj : ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెక్కివెక్కి ఏడ్చిన మహమ్మద్ సిరాజ్.. వీడియో వైరల్

Mohammed Siraj : ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెక్కివెక్కి ఏడ్చిన మహమ్మద్ సిరాజ్.. వీడియో వైరల్


Mohammed Siraj : ఇంగ్లాండ్‌పై అద్భుతమైన విజయం సాధించిన తర్వాత భారత క్రికెటర్లు ఆనందంలో మునిగిపోయారు. అయితే, ఓవల్ టెస్టులో భారత్ గెలిచిన అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కన్నీటి పర్యంతమయ్యాడు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్నప్పుడు సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లండన్‌లోని ఓవల్ క్రికెట్ గ్రౌండ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి, సిరీస్‌ను 2-2తో డ్రా చేసిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ భావోద్వేగానికి గురయ్యారు. పక్కనే ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతుండగా, సిరాజ్ కళ్లలో నీళ్లు తిరగడం వీడియోలో స్పష్టంగా కనిపించింది.

సిరీస్‌లో ఒక పరుగుల మెషిన్‌లా మారిన సిరాజ్, అలుపెరగకుండా కష్టపడ్డాడు. ఈ సిరీస్‌లో మొత్తం ఐదు టెస్టులు ఆడిన ఏకైక భారత పేసర్‌ అతనే. అతని కష్టానికి ప్రతిఫలం చివరి టెస్టులో లభించింది. కీలకమైన ఐదో రోజు అద్భుతమైన బౌలింగ్‌తో ఐదు వికెట్లు తీసి జట్టుకు విజయాన్ని అందించాడు. ఆ విజయం తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు.

అతని పక్కనే ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు .. “ఒకటి చెప్పడం కష్టం. ఎందుకంటే ప్రతిరోజూ మనం కొత్త విషయాలు నేర్చుకుంటాం. మొదటి మ్యాచ్ నుంచి ఇప్పటి వరకు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ మ్యాచ్‌లో కూడా చాలామంది నాల్గో పేసర్ ఆడాలని అనుకున్నారు. కానీ అతని స్థానంలో వచ్చిన కరుణ్.. మొదటి ఇన్నింగ్స్‌లో చేసిన 50 పరుగులు మాకు చాలా కీలకం. ఆ స్కోర్ వల్లే మేం ఒక మంచి టోటల్‌కు చేరుకోగలిగాం” అని అన్నాడు. గిల్ ఈ మాటలు చెబుతున్నప్పుడు, సిరాజ్ ఎమోషనల్ అయ్యాడు. అతని కళ్లలో ఆనందంతో పాటు కష్టపడినందుకు తగిన గుర్తింపు లభించిందనే భావన స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో ఇప్పుడు అభిమానుల మనసులను గెలుచుకుంది.

ఫీల్డింగ్‌లో తప్పిదానికి బౌలింగ్‌తో సమాధానం..

హైదరాబాద్‌కు చెందిన ఈ క్రికెటర్ నాలుగో రోజు చేసిన పొరపాటును ఐదో రోజు బౌలింగ్‌తో సరిదిద్దుకున్నాడు. నాలుగో రోజు హ్యారీ బ్రూక్ కొట్టిన ఒక బంతిని ఫీల్డింగ్‌లో అందుకున్న సిరాజ్, క్యాచ్ పట్టుకుని బౌండరీ లైన్‌ను తాకడంతో అది సిక్సర్‌గా మారింది. ఆ తప్పుకు చివరి రోజు బ్రూక్‌ను అవుట్ చేసి సమాధానం చెప్పాడు. అయితే, ఓవల్ టెస్టులో చివరి 50 పరుగుల కోసం ఇంగ్లాండ్ జట్టు తీవ్రంగా కష్టపడింది. భారత బౌలర్ల ఒత్తిడి కారణంగా వారు ఆరు పరుగుల తేడాతో ఓడిపోయారు. ఈ విజయం సిరీస్‌ను 2-2తో సమం చేయడంలో కీలక పాత్ర పోషించింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *