Mohammed Siraj : భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగిన ప్రతిష్ఠాత్మక ఆండర్సన్-టెండూల్కర్ టెస్ట్ సిరీస్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి, టీమిండియాను గెలిపించిన బౌలర్లలో మహ్మద్ సిరాజ్ ముందున్నాడు. అయితే సిరీస్ గెలిచిన ఆనందంలో ఉన్న సిరాజ్‌ను ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు, సిరాజ్ చాలా కూల్‌గా, స్ట్రైట్ ఫార్వార్డ్‌గా సమాధానం ఇచ్చి తన నోరు మూయించాడు. ఓవల్ టెస్టులో ఇంగ్లాండ్‌ను 6 పరుగుల తేడాతో ఓడించి, సిరీస్‌ను 2-2తో సమం చేసిన తర్వాత, మహ్మద్ సిరాజ్ ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారాడు. ఈ సిరీస్‌లో అద్భుతమైన బౌలింగ్ చేసి, చివరి మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి టీమ్ ఇండియాను గెలిపించాడు. మ్యాచ్ తర్వాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్‌కు వచ్చిన సిరాజ్‌కు ఒక జర్నలిస్ట్ నుండి ఊహించని ప్రశ్న ఎదురైంది.
ఈ సిరీస్ గురించి అడిగితే బాగుండేది కానీ, జర్నలిస్ట్ మాత్రం గతంలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ గురించి అడిగాడు. ఆ ప్రశ్న విన్న సిరాజ్ నవ్వుతూ చాలా ప్రశాంతంగా.. “సార్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా నేను 20 వికెట్లు తీశాను. ఆ సిరీస్‌లో జస్సీ భాయ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తుంటే, నా పని తనకు సహకారం అందించడమే” అని చెప్పాడు. సిరాజ్ ఇచ్చిన ఈ కౌంటర్ జవాబుతో ఆ జర్నలిస్ట్ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాడు. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో సిరాజ్ అభిమానులు అతడి తెలివైన సమాధానానికి ఫిదా అయ్యారు.
ఓవల్ టెస్టులో ఐదు వికెట్లు తీసిన సిరాజ్, ఈ సిరీస్‌లో మొత్తం 23 వికెట్లు పడగొట్టి, సరికొత్త రికార్డును సృష్టించాడు. విదేశీ గడ్డపై ఒక టెస్ట్ సిరీస్‌లో 20 కన్నా ఎక్కువ వికెట్లు తీసిన మూడవ భారత బౌలర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ ఘనత కపిల్ దేవ్, జస్ప్రీత్ బుమ్రా మాత్రమే సాధించారు. సిరాజ్ అంకితభావం, కష్టపడే తత్వాన్ని చూసి మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చాలా సార్లు మెచ్చుకున్నారు. టీమ్ కోసం సిరాజ్ తన సర్వస్వాన్ని పణంగా పెడతాడని కోహ్లీ ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పారు. ఈ సిరీస్‌లో సిరాజ్ చేసిన ప్రదర్శన కోహ్లీ మాటలను నిజం చేసింది.
ఓవల్ టెస్ట్ చివరి రోజు, ఇంగ్లాండ్ గెలవడానికి కేవలం 6 పరుగులు కావాల్సిన సమయంలో, సిరాజ్ గస్ అట్కిన్సన్‌ను క్లీన్ బౌల్డ్ చేసి భారత్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. అంతకుముందు నాలుగో రోజు క్యాచ్ మిస్ చేసినందుకు విమర్శలు ఎదుర్కొన్న సిరాజ్, ఈ బౌలింగ్‌తో తనపై వచ్చిన విమర్శలన్నింటికీ సమాధానం ఇచ్చాడు. చివరి సెషన్‌లో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కలిసి ఇంగ్లాండ్ బ్యాటింగ్‌ను కూల్చి, మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..