Mohammed Siraj : ఇంగ్లాండ్ సిరీసులో పిచ్చి పట్టినట్లే 31కిమీ పరిగెత్తిన మహమ్మద్ సిరాజ్.. కష్టానికి తగ్గ ఫలితం దక్కింది బ్రో

Mohammed Siraj : ఇంగ్లాండ్ సిరీసులో పిచ్చి పట్టినట్లే 31కిమీ పరిగెత్తిన మహమ్మద్ సిరాజ్.. కష్టానికి తగ్గ ఫలితం దక్కింది బ్రో


Mohammed Siraj : టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఎప్పుడూ ఫుల్ ఎనర్జీతో ఉంటాడు. అలుపు సొలుపు లేకుండా బౌలింగ్ చేస్తాడు. అయితే, ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అతను సాధించిన పరుగుల గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆ ఐదు టెస్టుల్లో సిరాజ్ ఏకంగా ఒక హాఫ్ మారాథాన్‌కు మించిన దూరాన్ని బౌలింగ్ చేస్తూ పరుగెత్తాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో ఈ అద్భుతమైన ఫీట్‌ను సిరాజ్ సాధించారు. ఈ మారథాన్ పరుగు కోసం అతను ప్రత్యేకంగా సమయం కేటాయించలేదు. కేవలం బౌలింగ్ చేస్తూనే ఈ రికార్డును నెలకొల్పాడు.

ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో మహమ్మద్ సిరాజ్ మొత్తం 185.3 ఓవర్లు వేశారు. అంటే, 25 రోజులలో 1113 బంతులు వేశారని అర్థం. ఒక ఫాస్ట్ బౌలర్ బంతి వేయడానికి రన్-అప్ తీసుకుని తిరిగి వెనక్కి రావడం అనేది ఒక పరుగుతో సమానం. సిరాజ్ రన్-అప్‌ను 14 మీటర్లుగా అంచనా వేస్తే, ఒక బంతి వేయడానికి అతను వెళ్ళడానికి, రావడానికి కలిపి 28 మీటర్లు పరిగెత్తాడు. ఈ లెక్కన, సిరీస్‌లో అతను వేసిన 1113 బంతులకు గాను సిరాజ్ మొత్తం 31 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం పరిగెత్తాడు.

మహమ్మద్ సిరాజ్ పరిగెత్తిన దూరం ఒలింపిక్స్‌లో జరిగే హాఫ్ మారథాన్ (21 కిలోమీటర్లు) కంటే 10 కిలోమీటర్లు ఎక్కువ. అలాగే, ఒలింపిక్స్ పూర్తి మారథాన్ (42.19 కిలోమీటర్లు) కంటే కేవలం 11 కిలోమీటర్లు మాత్రమే తక్కువ. ఈ లెక్కలు చూస్తుంటే, ఒక ఫాస్ట్ బౌలర్ మైదానంలో ఎంత కష్టపడతాడో తెలుస్తుంది.

సిరాజ్ ఈ సిరీస్‌లో కేవలం బౌలింగ్ కోసమే 31 కిలోమీటర్లు పరుగు పెట్టాడు. దీనికి బ్యాటింగ్, ఫీల్డింగ్ కోసం పరిగెత్తిన దూరాన్ని కలిపితే మొత్తం దూరం ఇంకా ఎంతో పెరుగుతుంది. ఈ అంతులేని శ్రమ వల్లే సిరాజ్‌కు సిరీస్‌లో గొప్ప విజయం లభించింది. ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో 23 వికెట్లు సాధించి అత్యంత విజయవంతమైన బౌలర్‌గా నిలవడం వెనుక అతని కఠోర శ్రమ, అంకితభావం ఎంత ఉందో దీని ద్వారా తెలుస్తోంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *