Mobile e-Voting: దేశంలోనే తొలిసారిగా మొబైల్‌ యాప్‌ ద్వారా ఓటింగ్‌.. ఎక్కడో తెలుసా?

Mobile e-Voting: దేశంలోనే తొలిసారిగా మొబైల్‌ యాప్‌ ద్వారా ఓటింగ్‌.. ఎక్కడో తెలుసా?


త్వరలోనే బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం రాష్ట్రంలోని మూడు జిల్లాల్లోని ఆరు మున్సిపల్‌ కౌన్సిళ్లకు జరిగిన ఎన్నికల్లో దేశంలోనే తొలిసారిగా మొబైల్‌ ఫోన్‌ ద్వారా పౌరులు ఓటు వేసే అవకాశాన్ని కల్పించింది. ఈ సందర్భంగా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు వేయలేని వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణీలు, వలస కార్మికులు ఈ మొబైల్‌ ఫోన్‌ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇది ఆండ్రాయిడ్‌ ఫోన్లలో మాత్రమే పనిచేస్తోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దీపక్ ప్రసాద్ తెలిపారు.

ఓటర్లు ఈ సదుపాయాన్ని కొత్త ఇ-SECBHR మొబైల్ యాప్ లేదా రాష్ట్ర ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్ ద్వారా వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ యాప్‌ మెసాలను కూడా కనిపెట్టేలా రూపొందించినట్టు తెలిపారు. మోసాలను నిరోధించడానికి దీనిలో బ్లాక్‌చెయిన్, ఫేస్ మ్యాచింగ్, స్కానింగ్ వంటి అధునాతన సాంకేతికతలను అధికారులు ఏర్పాటు చేశారు. అయితే దీంటో ఒక మొబైల్ నంబర్ నుండి ఇద్దరు నమోదిత ఓటర్లు తమ ఐడీలతో లాగిన్‌ చేసుకొని ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. వేసిన ప్రతి ఓటును నిర్ధారించేందుకు ఇది మన ఓటర్‌ ఐడీతో క్రాస్ చెక్‌చేసుకుంటుంది. ఆ తర్వాతే ఓటును పరిగణనలోకి తీసుకుంటుంది. అయితే ప్రస్తుతానికి ఈ యాప్‌ ఆండ్రాయిడ్ ఫోన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

మొబైల్ యాప్‌ ద్వారా ఓటు ఎలా వేయాలి..

ఓటర్లు తమ ఫోన్ నుండి ఓటు వేయాలనుకుంటే, మొదటగా మీ ఫోన్‌లోని ప్లేస్‌స్టోర్ నుంచి e-SECBHR యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఓటర్‌ ఐడీకి లింక్‌ అయి ఉన్న మొబైల్‌ నెంబర్‌తో e-SECBHR యాప్‌ను లింక్‌ చేసుకోవాలి. తర్వాత మీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీ ద్వారా రిజిస్టర్ కావాలి. మీ గుర్తింపును ధృవీకరించడానికి ఆధార్ లేదా ఇతర చెల్లుబాటు అయ్యే ID పత్రాలను అప్‌లోడ్ చేయాలి. తర్వాత ఈసీ మీ వివరాలను ఓటర్ జాబితాతో పోల్చి చెక్‌ చేస్తుంది. అన్ని ఓకే అయితే మీకు యాక్సెస్‌ ఇస్తుంది. ఎన్నికల రోజున యాప్‌లో లాగిన్ అయ్యి ఓటిపీ ద్వారా ఎంటర్‌ అవ్వాలి. మీరు ఓటు వేసిన తర్వాత ఓటు సక్సెస్‌ అయినట్టు మీకు మెసేజ్ వస్తుంది. అయితే ఓట్‌ వేసే టప్పుడు మీ ఇంటర్‌నెట్‌ సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి.

Note: యాప్‌ను అధికారిక స్టోర్ నుండి మాత్రమే డౌన్‌లోడ్ చేయండి, ఎందుకంటే నకిలీ యాప్‌ల ద్వారా మోసాలు జరిగే అవకాశం ఉంది.
ఏవైనా సాంకేతిక సమస్యలు లేదా రిజిస్ట్రేషన్ సంబంధిత సందేహాల కోసం, బీహార్ ఎన్నికల సంఘం యొక్క అధికారిక వెబ్‌సైట్ (sec.bihar.gov.in) లేదా హెల్ప్‌లైన్‌ను సంప్రదించండి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *