Metro: మెట్రో విప్లవం.. దేశవ్యాప్తంగా రోజుకు ఎంత మంది ప్రయాణిస్తారో తెలుసా..?

Metro: మెట్రో విప్లవం.. దేశవ్యాప్తంగా రోజుకు ఎంత మంది ప్రయాణిస్తారో తెలుసా..?


మెట్రో నెట్‌వర్క్ విస్తరణలో భారత్ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మెట్రో వ్యవస్థగా నిలిచింది. 2014లో కేవలం 5 నగరాల్లోనే 248 కి.మీ మెట్రో నెట్‌వర్క్ ఉండగా.. మే 2025 నాటికి ఇది 23 నగరాల్లో 1,013 కి.మీ.కు పెరిగింది. మేక్ ఇన్ ఇండియా కింద ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దీనికి బాగా ఉపయోగపడ్డాయి. స్థానిక ఉత్పత్తిని పెంచడానికి, వాణా రంగంలో స్వావలంబనను ప్రోత్సహించడానికి ఇది ఒక సాహసోపేతమైన అడుగు. గత పదేళ్లలో, భారతదేశం తన మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించడంలో దాదాపు ₹2.5 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇది మెట్రో కోచ్‌ల స్థానిక తయారీకి ఆజ్యం పోసింది. దాదాపు 2,000 కి పైగా మెట్రో కోచ్‌లు తయారు చేయబడ్డాయి. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, మే 2024 నాటికి ఢిల్లీ, జైపూర్, కోల్‌కతా, బెంగళూరు, ముంబై వంటి నగరాలకు 2,000 కంటే ఎక్కువ మెట్రో కోచ్‌లను సరఫరా చేసింది.

ప్రయాణీకులకు జీవనాధారంగా..

మెట్రో ప్రయాణికుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తుంది. నెట్‌వర్క్ విస్తరణతో ప్రజల కష్టాలు తప్పాయి. 2013-14లో సగటున 28 లక్షల మంది ప్రతిరోజూ మెట్రోలో ప్రయాణించగా.. ఇప్పుడు ఈ సంఖ్య రోజుకు 1.12 కోట్లకు పెరిగింది. ఇది నగరాల్లో ట్రాఫిక్ జామ్‌లు, కాలుష్యాన్ని తగ్గించడంలోనూ సహాయపడింది.

వేగంగా నిర్మాణం..

కొత్త లైన్ల నిర్మాణం కూడా వేగంగా పెరుగుతోంది. 2014కి ముందు మెట్రో నిర్మాణ సగటు వేగం నెలకు 0.68 కి.మీ ఉటే ఇప్పుడు అది నెలకు 6 కి.మీ.కు పెరిగింది. బడ్జెట్ కేటాయింపులు కూడా 2013-14లో రూ. 5,798 కోట్ల నుండి 2025-26లో రూ. 34,807 కోట్లకు వేగంగా పెరిగాయి.

ప్రభుత్వ విధానాలు – మేక్ ఇన్ ఇండియా

2017లో అమల్లోకి వచ్చిన మెట్రో రైలు విధానం ప్రాజెక్టులను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించింది. దీని కింద.. నగరాలు సమగ్ర మొబిలిటీ ప్లాన్, అర్బన్ మెట్రో ట్రాన్స్‌పోర్ట్ అథారిటీను రూపొందించడం తప్పనిసరి చేశారు. దీనితో పాటు, కేంద్ర సహాయం కోసం కనీసం 14శాతం ఆర్థిక అంతర్గత రాబడి రేటు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం భాగస్వామ్యం తప్పనిసరిగా మారింది. మేక్ ఇన్ ఇండియా చొరవ కింద.. దేశంలో 75శాతం మెట్రో కార్లు, 25శాతం పరికరాలను తయారు చేయడం తప్పనిసరి చేయబడింది.

సాంకేతిక – పర్యావరణ ఆవిష్కరణలు

అండర్ వాటర్ మెట్రో: కోల్‌కతాలోని హూగ్లీ నది కింద నీటి అడుగున మెట్రో సొరంగం 520 మీటర్లు విస్తరించి ఉంటుంది.

వాటర్ మెట్రో: దేశంలో వాటర్ మెట్రోను ప్రవేశపెట్టిన మొట్టమొదటి నగరంగా కేరళలోని కొచ్చి నిలిచింది.

గ్రీన్ ఇనిషియేటివ్స్: సోలార్ పవర్ స్టేషన్లు, రీజెనరేటివ్ బ్రేకింగ్, IGBC సర్టిఫైడ్ స్టేషన్లు.

డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్: NCMC కార్డ్, QR కోడ్ టికెటింగ్, డ్రైవర్‌లెస్ మెట్రో స్వదేశీ I-ATS వ్యవస్థ.

వేగంగా ఈ ప్రాజెక్టు పనులు

రాబోయే సంవత్సరాల్లో, పూణే మెట్రో ఫేజ్-2, ఢిల్లీ మెట్రో ఎక్స్‌టెన్షన్, అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ, బెంగళూరు మెట్రో ఫేజ్-3 వంటి ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి. దీంతో పాటు 24 నగరాల్లో వాటర్ మెట్రో పథకాలు ప్రతిపాదనలు ఉన్నాయి. దేశ మెట్రో నెట్‌వర్క్ కేవలం రవాణా సాధనంగా మాత్రమే కాకుండా, ఆధునిక, శుభ్రమైన, వేగవంతమైన పట్టణ అభివృద్ధికి చిహ్నంగా మారింది. 2030 నాటికి, ఈ నెట్‌వర్క్ మరింత పెద్ద స్థాయిలో విస్తరిస్తుందని భావిస్తున్నారు. ఇది భారతీయ నగరాల్లో ట్రాఫిక్ ముఖచిత్రాన్ని పూర్తిగా మారుస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *