అందుకు తగ్గట్టుగానే వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి ఈ అందాల తారకు. నాని, శర్వానంద్, వరుణ్ తేజ్, రవితేజ, వెంకటేష్, సాయి ధరమ్ తేజ్, విజయ్ దేవరకొండ, సందీప్ కిషన్, నాగ శౌర్య తదితర క్రేజీ హీరోలతో సినిమాలు చేసింది. సూపర్ హిట్ సినిమాలు కూడా ఖాతాలో పడ్డాయి. ఇంకా అంతా బాగుంటుందనుకున్న తరుణంలో ఈ ముద్దుగుమ్మ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.