Megastar Chiranjeevi: బాస్ రా బచ్చా.. ఫరియాతో స్టెప్పులు ఇరగదీసిన మెగాస్టార్.. ఫ్యాన్స్ ఖుషీ..

Megastar Chiranjeevi: బాస్ రా బచ్చా.. ఫరియాతో స్టెప్పులు ఇరగదీసిన మెగాస్టార్.. ఫ్యాన్స్ ఖుషీ..


మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు థియేటర్ల వద్ద భారీ కటౌట్స్.. పాలభిషేకాలతో ఫ్యాన్స్ చేసే హడావిడి గురించి తెలిసిందే.. ఇక బాస్ సినిమా టికెట్స్ కోసం చొక్కాలు చింపుకునేవాళ్లు. కానీ చిరు పేరు చెప్పగానే ముందుగా గుర్తుకువచ్చేది డ్యాన్స్. తెలుగు సినిమాకు బ్రేక్ డ్యాన్స్ నేర్పించింది ఆయనే. కొత్త కొత్త స్టెప్పులతో.. ఎనర్జిటిక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేశారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టారు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. ఆ తర్వాత విలన్ గానూ నటించారు. ఆత్మ విశ్వాసం, స్వయంకృషితో ఎదిగి ఇండస్ట్రీలోనే చక్రం తిప్పిన మెగాస్టార్ అయ్యారు. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Serial Actress: తస్సాదియ్యా అమ్మడు.. సీరియల్స్ మానేసింది.. ఇప్పుడు నెట్టింట సెగలు పుట్టిస్తోంది..

ఇవి కూడా చదవండి

దశాబ్దాలుగా సినిమా ప్రపంచాన్ని ఏలేస్తున్న మెగాస్టార్.. ఇప్పటికీ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఖైదీ 150 సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన చిరు.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ చేస్తున్నారు. ఇటీవలే విశ్వంభర మూవీ చిత్రీకరణ కంప్లీట్ చేసిన చిరు.. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. ఇందులో నయనతార కథానాయికగా నటిస్తుంది. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న చిరు.. ఫిట్నెస్ విషయంలోనూ కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. బరువు తగ్గి స్లిమ్ గా మారిపోయారు. ఇక ఇప్పటికీ ఆయన గ్రేస్ ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఆయన డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

ఇవి కూడా చదవండి: Actress : ఒక్క సినిమాతో ఫేమస్.. ముద్దు సీన్ అనగానే గుక్కపెట్టి ఏడ్చేసింది.. దెబ్బకు ఆఫర్స్ గోవిందా..

ఇటీవల ఓ టీవీ ఛానల్ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు చిరంజీవి. ఆయన రావడంతో అక్కడ ఫుల్ జోష్ నెలకొంది. ఇక ఆ తర్వాత స్టేజ్ మీద హీరోయిన్ ఫరియా అబ్దుల్లాతో కలిసి స్టెప్పులు ఇరగదీశారు చిరు. ఎప్పటిలాగే ఎనర్జీటిక్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‏తో ఉర్రూతలూగించారు. ముగ్గురు మొనగాళ్లు సినిమాలోని చామంతి పువ్వా పాటకు ఫరియాతో కలిసి స్టెప్పులు అదరగొట్టారు చిరు. 69 ఏళ్ల వయసులోనూ తగ్గేదే లే అన్నట్లుగా చిరు స్టెప్స్ వేస్తుంటే..అక్కడున్నవారంతా విజిల్స్, అరుపులతో రచ్చ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ.. బాస్ రా బచ్చా.. ఇప్పటికీ అదే గ్రేస్..అదే జోష్.. అన్నయ్య గ్రేస్.. తగ్గేదే లే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరు చూసేయ్యండి.

ఇవి కూడా చదవండి: Tollywood: పొలిటికల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్.. టాలీవుడ్‏లో క్రేజీ హీరో.. ఇంతకీ ఆ స్టార్ ఎవరంటే..

ఇవి కూడా చదవండి: Cinema: ఏం సినిమా రా బాబూ.. ఏకంగా 17400 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *