Megastar Chiranjeevi : ఎన్టీఆర్‏తో బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. చిరంజీవి సరసన ఛాన్స్.. తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..

Megastar Chiranjeevi : ఎన్టీఆర్‏తో బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. చిరంజీవి సరసన ఛాన్స్.. తెలుగులోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..


మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఉండే గురించి చెప్పక్కర్లేదు. ఇటీవలే మన శంకరవరప్రసాద్ గారు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీంతో ఇప్పుడు చిరు నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతున్న చిరు.. ఇప్పటికీ యంగ్ కుర్రాళ్లకు గట్టిపోటీనిస్తున్నారు. ఏడు పదుల వయసులోనూ ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆనయ తన రాబోయే 158 సినిమా కోసం సిద్ధమవుతున్నారు.ఈ చిత్రానికి డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహించనున్నారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..

తాజాగా వినిపిస్తున్న సమాచారం చిరు, డైరెక్టర్ బాబీ కాంబోలో రాబోతున్న సినిమాలో హీరోయిన్ ప్రియమణి ఎంపికైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం గురించి చర్చలు జరుగుతున్నాయని టాక్. ఒకప్పుడు తెలుగులో ప్రియమణి తోపు హీరోయిన్. ఎన్టీఆర్ సరసన యమదొంగ చిత్రంలో నటించింది.అలాగే తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఈ అమ్మడు.. ఇప్పుడు హిందీలో వరుస వెబ్ సిరీస్ లు చేస్తుంది. ఇటీవలే ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ లో కనిపించింది.

ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

మొదటిసారి చిరంజీవి, ప్రియమణి కాంబో తెరపైకి రానుండడంతో ఈ సినిమాపై మరింత క్యూరియాసిటి నెలకొంది. మన శంకర వర ప్రసాద్ గారు సినిమాలో చిరంజీవి, నయనతార జంటగా నటించారు. నిజానికి వీరిద్దరి జోడికి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. గతంలో వీరిద్దరు కలిసి సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటించారు.

ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..

View this post on Instagram

A post shared by Priya Mani Raj (@pillumani)

ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *