Mayasabha: దేవా కట్ట “మయసభ”లో వంగవీటి రంగా పాత్ర ఎంత.? ఎవరిది.?

Mayasabha: దేవా కట్ట “మయసభ”లో వంగవీటి రంగా పాత్ర ఎంత.? ఎవరిది.?


ప్రముఖ దర్శకుడు దేవా కట్ట క్రియేట్ చేసిన పొలిటికల్ థ్రిల్లర్ “మయసభ” ఆగస్టు 7 నుండి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. 1974–1980 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ మార్పుల నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్ ఇప్పటికే టీజర్, ట్రైలర్ ద్వారా చర్చలకు కేంద్రబిందువైంది. 74-80 కాలానికి రాజకీయంగా ప్రాధాన్యత కలిగిన నేతలెవరైనా సరే రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, కానీ వీరితోపాటుగా రాజకీయాలను శాసించిన అత్యంత ప్రజాదరణ పొందిన నేత, విజయవాడ ప్రాంతానికి మరియు ఒక సామాజిక వర్గానికి దేవుడిలా కొలవబడిన వంగవీటి రంగా పేరును తలచుకోకుండా ఆ కాలాన్ని పూర్తిగా వివరించలేం.

ఇది కూడా చదవండి :ఇదెక్కడి మేకోవర్ మావ..! అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ గుర్తుందా.? ఇప్పుడు సినిమాలు మానేసి

అందుకే ఇప్పుడు ముఖ్య ప్రశ్న: “మయసభ”లో వంగవీటి రంగ పాత్ర ఉందా? ఉంటే, ఆ పాత్రను ఎవరు పోషిస్తున్నారు? ఆ పాత్ర CBN, YSR పాత్రల ప్రయాణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది. ? ఈ ప్రశ్నలు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : ఛీ ఛీ.. ఇదేం సినిమారా బాబు..! వయసులో ఉన్న భార్య, ముసలి భర్త.. మధ్యలో మరో వ్యక్తి

గతంలో వంగవీటి రంగ తన బయోపిక్‌ను “చైతన్య రథం”గా నిర్మించగా, ఇటీవల తెలుగు చిత్ర పరిశ్రమలో మరికొన్ని బయోపిక్స్ వెలుగుచూశాయి. ఇప్పుడు “మయసభ”లో రంగ పాత్ర ఏ స్థాయిలో ఉంటుందన్న ఆసక్తి మరింత పెరుగుతోంది. ప్రత్యేకంగా, అతని హత్య వెనక ఉన్న రాజకీయ కుట్రను కూడా ఈ సిరీస్ లో దేవా కట్ట తవ్వి చూపించబోతున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం… ఆగస్టు 7న సోనీ లివ్‌ లో ‘మయసభ’ తెరపైకి రాగానే తెలుస్తుంది. వైవిధ్యమైన కంటెంట్‌తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోన్న వన్ అండ్ ఓన్టీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లివ్ నుంచి రాబోతుంది ‘మయసభ : రైజ్ ఆఫ్ ది టైటాన్స్’ . ఈ సినిమా ఇప్పటికే సెన్సేషన్‌గా మారింది. వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవా కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వంలో హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష ఈ సిరీస్‌ను రూపొందించారు.

ఇది కూడా చదవండి : అప్పట్లో ఊపేసిన హీరోయిన్.. అందరితో నటించింది.. కానీ నాగార్జునను మాత్రం రిజెక్ట్ చేసింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *