Malavika Mohanan: రాజా సాబ్‏లో హీరోయిన్‏కు డూప్.. రూమర్స్ పై మాళవిక రియాక్షన్.. ప్రూఫ్స్ బయపెట్టిన ముద్దుగుమ్మ..

Malavika Mohanan: రాజా సాబ్‏లో హీరోయిన్‏కు డూప్.. రూమర్స్ పై మాళవిక రియాక్షన్.. ప్రూఫ్స్ బయపెట్టిన ముద్దుగుమ్మ..


డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటేస్ట్ మూవీ ది రాజా సాబ్. ఫాంటసీ హారర్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించిన సంగతి తెలిసిందే. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ నటించారు. ఈ సినిమాతోనే తెలుగు తెరకు పరిచయమైంది మాళవిక. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇక ఇటీవల ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయగా..విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఫేస్ స్వాప్, బాడీ డబుల్, డూప్ షాట్స్ వంటి వాటిపై నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా మాళవిక యాక్షన్ సీన్స్ కోసం డూప్ చేసిందంటూ ఓ ఫోటో నెట్టింట షేర్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోల్స్ పై తనదైన స్టైల్లో స్పందించింది.

ఎక్కువమంది చదివినవి : Folk Song : ఏం పాటరా బాబూ.. కుర్రాళ్లు తెగ పాడుతున్న ఫోక్ సాంగ్.. దెబ్బకు యూట్యూబ్‏లో సంచలనంగా మారింది..

“ది రాజా సాబ్ చిత్రంలో నా స్టంట్స్ అన్నీ నేనే చేశానని చెప్పాను. కానీ నా బదులుగా బాడీ డబుల్ ఆ ఫైట్స్ చేసినట్లుగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోస్, కథనాలు చూస్తున్నాను. ఈ సినిమాలో నా స్టంట్ డబుల్ అయిన స్టంట్ ఆర్టిస్ట్ ఫోటో ఆన్ లైన్ లో వైరల్ కావడం నేను చూశాను. నేను యాక్షన్ ను బాగా ఎంజాయ్ చేస్తాను. అందుకే యాక్షన్ సీన్స్ నేను చేస్తాను. చిన్నప్పటి నుంచి క్రీడల్లో చురుకైన అమ్మాయిని. నా శరీరాన్ని ఫిజికల్ గా సవాలు చేయడం.. కొత్త విషయాలు నేర్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంటుంది.

ఎక్కువమంది చదివినవి : Uday Kiran : అప్పుడు నాకు ఏడేళ్లు.. మా మావయ్య సినిమాను థియేటర్లలో చూడండి.. ఉదయ్ కిరణ్ మేనల్లుడు రిక్వెస్ట్..

అలాగే నటీనటులు స్వయంగా స్టంట్స్ చేస్తున్నప్పటికీ సెట్స్ లో ఎప్పుడూ ఒక స్టంట్ డబుల్ ఉంటారు. ఎందుకంటే వారంతా చాలా ఎక్స్పర్ట్స్ కాబట్టి. యాక్టర్లతో ఫైనల్ షాట్ తీయడానికి ముందు.. యాక్షన్ డైరెక్టర్ ఆ షాట్ ను వారితో రిహార్సల్ చేయిస్తారు. కొన్నిసార్లు రిస్క్ అయినప్పుడు ఆ రిస్కీ షాట్ ను ప్రొఫెషనల్స్ తో చేయించడం మంచిదని భావిస్తారు. నాకు నేర్పించిన నా స్టంట్ డబుల్ కు బిగ్ హగ్” అంటూ మాళవిక ట్వీట్ చేసింది. అలాగే ఆమె యాక్షన్ సీన్స్ షూటింగ్ వీడియోస్ సైతం షేర్ చేసింది. దీనిని బట్టి చూస్తే సినిమాలో యాక్షన్ సీన్స్ మాళవిక చేసినట్లు తెలుస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Jabardasth: జబర్దస్త్ మానేసి తప్పు చేశాను.. మాటలు నమ్మి అలా జరిగింది.. జబర్దస్త్ కమెడియన్..

ఎక్కువమంది చదివినవి : Actor : సూపర్ స్టార్ కొడుకు.. అయినా అవకాశాలు ఇవ్వలేదు.. ఒక్క సినిమాతో ఇండస్ట్రీనే షేక్ చేశాడు..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *