Mahavatar Narasimha: ఓటీటీలోకి మహావతార్‌ నరసింహ.. స్ట్రీమింగ్ పై నిర్మాణ సంస్థ పోస్ట్ వైరల్..

Mahavatar Narasimha: ఓటీటీలోకి మహావతార్‌ నరసింహ.. స్ట్రీమింగ్ పై నిర్మాణ సంస్థ పోస్ట్ వైరల్..


పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా మహావతార్ నరసింహ. చిన్న సినిమాగా విడుదలై భారీ వసూళ్లు రాబడుతుంది. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇటీవలే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కేవలం పది రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరింది ఈ మూవీ. అలా చేసి ఫస్ట్ యానిమేషన్ సినిమాగా సరికొత్త చరిత్ర క్రియేట్ చేసింది. మొదటి రోజు ఏకంగా రూ.1.35 కోట్లు రాబట్టింది. కేవలం పది రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం థియేటర్లలో ఓ రేంజ్ లో సందడి చేస్తుంది. శ్రీ మహావిష్ణు నరసింహావతారం ఆధారంగా కన్నడలో రూపొందించిన ఈ సినిమా తెలుగుతోపాటు పలు భాషల్లో విడుదలైంది. ఓవైపు థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి: Tollywood: ఉదయం లేవగానే ముఖానికి ఉమ్మీ రాసుకుంటాను.. స్టార్ హీరోయిన్ బ్యూటీ సీక్రెట్.. ఫ్యాన్స్ షాక్..

ఓ ప్రముఖ ఓటీటీలో ఈ సినిమా సెప్టెంబరులో గానీ.. లేదా అక్టోబర్ లో గానీ స్ట్రీమింగ్ కానుందంటూ ప్రచారం నడుస్తుంది. తాజాగా ీ రూమర్స్ పై నిర్మాణ సంస్థ క్లీమ్ ప్రొడక్షన్స్ స్పందించింది. సోషల్ మీడియా వేదికగా పలు విషయాలను పంచుకుంది. “మహావతార్ నరసింహ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రానుందనే ప్రచారం మా దృష్టికి వచ్చింది. దానిపై స్పష్టత ఇవ్వాలి అనుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శితమవుతుంది. ఇప్పుడు ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ మేము ఖరారు చేయలేదు. మా సోషల్ మీడియా ఖాతాలో వచ్చే అప్డేట్స్ మాత్రమే నమ్మండి ” అంటూ పోస్ట్ చేసింది. దీంతో మహవతార్ నరసింహా సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై స్పష్టత వచ్చింది.

ఇవి కూడా చదవండి: Pawan Kalyan: ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్.. ఎవరో గుర్తుపట్టారా.. ?

జూలై 25న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ యానిమేషన్ సినిమాకు అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుంది ఈ మూవీ. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి: Kamal Haasan: అప్పుడు చిన్న హీరోయిన్.. ఇప్పుడు కమల్ హాసన్‏తోనే.. ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి: Mahesh Babu : కాలేజీలో మహేష్ బాబు బెస్ట్ ఫ్రెండ్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తోపు హీరోయిన్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *