Maha Shivratri: మహా శివరాత్రి వేడుకల్లో సినిమా తారలు.. భక్తి పాటలకు హీరోయిన్ల స్టెప్పులు.. వీడియోలు ఇదిగో

Maha Shivratri: మహా శివరాత్రి వేడుకల్లో సినిమా తారలు.. భక్తి పాటలకు హీరోయిన్ల స్టెప్పులు.. వీడియోలు ఇదిగో


మహా శివరాత్రి వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ వేడుకల్లో భాగమయ్యారు. ఈ పర్వదినాన ప్రత్యేక పూజలు, వ్రతాలు ఆచరించారు. ఇక ఎప్పటిలాగే . తమిళనాడులోని కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో మహా శివరాత్రి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో వేలాది మంది భక్తులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా పాల్గొన్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి దురంధర్ బ్యూటీ సారా అర్జున్, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి, బిగ్ బాస్ తెలుగు ఫేమ్ హరి తేజ, బాలీవుడ్ భామ మౌనీ రాయ్ ఈ వేడుకలకు హాజరయ్యారు.ఈ సందర్భంగా వీరంతా పంచ భూత క్రియ పూజలో పాల్గొన్నారు. అలాగే భక్తి పాటలకు మంత్రముగ్ధులై డ్యాన్సులు వేస్తూ సందడి చేశారు. హీరోయిన్స్‌ డ్యాన్స్ చేస్తోన్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.

ఇక బాలీవుడ్ బ్యూటీ జుహీ చావ్లా కూడా ఈ వేడుకల్లో సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘నేను కొన్ని సంవత్సరాలుగా సద్గురు జీని అనుసరిస్తున్నాను. ఆయన కార్యక్రమాలకు వస్తూనే ఉన్నాను. నేను చూసిన ప్రతిసారీ ఈ వేడుక మరింత గొప్పగా మారుతోంది. ఇది చాలా అర్థంతో కూడిన వేడుక. మనల్ని మన స్వంత సంస్కృతికి దగ్గర చేస్తుంది’ అని పేర్కొంది. ఇక బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ ఆదియోగి శివ విగ్రహం ముందు ప్రార్థనలు చేస్తూ, నృత్యం చేస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. తమన్నా భాటియా ఈషా యోగా సెంటర్‌లో తన మహాశివరాత్రి వేడుకల ఫోటోలను కూడా పంచుకుంది.

ఇవి కూడా చదవండి

సారా అర్జున్ డ్యాన్స్..

తమన్నా స్టెప్పులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *