ప్రముఖ ఫోక్ సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఇటీవలే దగ్గరుండి తన చెల్లికి నిశ్చితార్థం చేసిన మధుప్రియ.. ప్రస్తుతం ఆమె పెళ్లి పనుల్లోనూ బిజీ అయిపోయింది. దగ్గరుండి అన్ని పెళ్లి పనులు చూసుకుంటోంది. అలాగే ఎప్పటికప్పుడు తన చెల్లి పెళ్లి అప్డేట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది. శ్రుతి ప్రియ పెళ్లి వేడుకల ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది.