Madhan Bob: స్టార్ కమెడియన్‌ను కబళించిన క్యాన్సర్.. మదన్ బాబ్ తెలుగులో నటించిన సినిమాలు ఇవే

Madhan Bob: స్టార్ కమెడియన్‌ను కబళించిన క్యాన్సర్.. మదన్ బాబ్ తెలుగులో నటించిన సినిమాలు ఇవే


వందలాది సినిమాల్లో నటించి మెప్పించి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించిన మదన్ బాబ్ (71) కన్నుమూశారు. గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన శనివారం (ఆగస్టు 3) సాయంత్రం చెన్నైలో తుది శ్వాస విడిచారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మదన్ బాబుకు నివాళులు అర్పిస్తున్నారు. ఆయన అత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా ప్రార్థిస్తున్నారు. ఇవాళ మదన్ బాబ్ అంత్యక్రియలు నిర్వహించే అవకాశముంది. కాగా మదన్ బాబ్ అసలు పేరు ఎస్. కృష్ణమూర్తి. సినిమాల్లోకి వచ్చాక తన పేరును మదన్ బాబు గా మార్చుకున్నారు. తమిళంలో ఎక్కువగా సినిమాలు చేసిన ఆయన రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ కుమార్, సూర్య, విజయ్, మాధవన్ తదితర స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వందలాది సినిమాల్లో నటించి ఆడియెన్స్ ను నవ్వుల్లో ముంచెత్తారు. మదన్ బాబు సినిమాల్లోనే కాకుండా టెలివిజన్‌లో కూడా పనిచేశారు. టీవీ కామెడీ షోలలో న్యాయనిర్ణేతగా కనిపించారు. ఇక నటనతో పాటు, మదన్ బాబుకు సంగీతంపై కూడా ఆసక్తి ఉండేది. ఆయన మంచి కీబోర్డ్ ప్లేయర్.

తమిళంలో ఆరు, జెమిని (విక్రమ్), రన్, జోడీ, మిస్టర్ రోమియో, తెనాలి, ఫ్రెండ్స్, రెడ్, లింగ, రాయన్ తదితర చిత్రాల్లో మదన్ బాబ్ నటించారు. ఈ చిత్రాలన్నీ తెలుగులోకి కూడా డబ్ అయ్యాయి. అయితే మదన్ డైరెక్ట్ తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించలేదు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన బంగారం సినిమాలో ఒక చిన్న పాత్రలో ఆయన కనిపించారు. మదన్ కు ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ప్రముఖుల నివాళి..

మదన్ బాబ్  మరణంపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు నివాళి అర్పిస్తున్నారు. నటునితో తమ అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా మదన్ బాబ్  కు నివాళి అర్పిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.

. “మేము కలిసి స్క్రీన్ పంచుకున్నాము. సెట్స్‌లో ఆయన ఆనందంగా ఉన్నారు. ఆయన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరినీ నవ్వించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ మా జ్ఞాపకాలలో ఉంటారు” అని ప్రభు దేవర్ పోస్ట్ చేశారు.

ప్రభుదేవా ఎమోషనల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *