Lung Cancer: ఆహారంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు.. వీటికి దూరంగా ఉండటం బెటర్!

Lung Cancer: ఆహారంతో ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు.. వీటికి దూరంగా ఉండటం బెటర్!


ప్రపంచవ్యాప్తంగా యేటా లక్షలాది మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న ప్రాణాంతక వ్యాధుల్లో క్యాన్సర్ అగ్రస్థానంలో ఉంది . అందులో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాధిని తిప్పికొట్టవచ్చు. మన శరీరానికి అలాంటి శక్తి ఉంది. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాల గురించి తెలుసుకుంటే ప్రారంభ దశలనే నివారించడానికి అవకాశం ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయంటే..?

  • దగ్గు
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
  • దగ్గుతున్నప్పుడు రక్తం
  • వెన్నునొప్పి
  • మానసిక స్థితిలో మార్పులు
  • అధికంగా బరువు తగ్గడం
  • అలసట
  • ఛాతీ నొప్పి
  • తలనొప్పి

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను నివారించడానికి తీసుకోవల్సిన జాగ్రత్తలు

  • ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ధూమపానం ప్రధాన కారణం. మీరు ధూమపానం చేసేవారైతే, వెంటనే ఆ అలవాటును మానేయడానికి ప్రయత్నించండి. అవసరమైతే నిపుణుల సహాయం తీసుకోండి.
  • వాయు కాలుష్యం కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రదాన కారకం. కాబట్టి బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించాలి.
  • కొన్ని రసాయనాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి తగిన భద్రతా జాగ్రత్తలు పాటించాలి.
  • వీలైనంత వరకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు చేర్చుకోవాలి.
  • యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఎందుకంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
  • ముఖ్యంగా అల్ట్ర పాసెస్ట్ ఫుడ్ అంటే.. బ్రెడ్, సోడా, నూడిల్స్ వంటి ఆహారాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని వేగంగా పెంచుతాయి.
  • ప్రారంభ దశలోనే ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను గుర్తించడానికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి, 6 నెలలకు ఒకసారి వైద్యుడిని సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *