Lucky Zodiac Signs: ఉచ్ఛ స్థితిలో శుక్రుడు.. ఇక వారికి మహర్దశ ఖాయం..!

Lucky Zodiac Signs: ఉచ్ఛ స్థితిలో శుక్రుడు.. ఇక వారికి మహర్దశ ఖాయం..!


మార్చి 3 నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు శుక్రుడు మీన రాశిలో ఉచ్ఛ స్థితిలోకి రావడం జరుగుతోంది. సుఖ సంతోషాలకు, సిరిసంపదలకు, శృంగార జీవితానికి, పెళ్లిళ్లు, ప్రేమ వ్యవహారాలకు కారకుడైన శుక్రుడు ఉచ్ఛపట్టడం వల్ల కొన్ని రాశుల వారి జీవితాలు, జీవనశైలి పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. వీరికి తప్పకుండా జీవితంలో సరికొత్త అధ్యాయం ప్రారంభం అవుతుంది. అన్ని రంగాల్లోనూ పురోగతి ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. వృషభం, మిథునం, కర్కాటకం, కన్య, ధనుస్సు, మకర రాశులవారు అత్యధికంగా ఉచ్ఛ శుక్రుడి వల్ల లాభాలు పొందుతారు.

  1. వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల అనేక వైపు నుంచి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. వస్త్రాభరణాలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. అత్యంత ప్రముఖులతో లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలను మించుతాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి కుదురుతుంది. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి.
  2. మిథునం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్రుడికి ఉచ్ఛ స్థితి కలగడం వల్ల ఒక సంస్థలో సర్వాధికారి అయ్యే అవకాశం ఉంది. విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగపరంగా అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. తప్పకుండా కుబేర యోగం పడుతుంది. ఉద్యోగులకు బాగా డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీతో పాటు రాబడి కూడా వృద్ది చెందే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది.
  3. కర్కాటకం: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్రుడు ఉచ్ఛ స్థితిలోకి వస్తున్నందువల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. విదేశీ సంపాదనను అనుభవించే యోగం పడుతుంది. తండ్రి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. కోర్టు కేసులు కూడా అనుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది.
  4. కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉచ్ఛ శుక్రుడి సంచారం వల్ల సంపన్న జీవితం ప్రారంభమవుతుంది. లక్ష్మీ కటాక్షం అపారంగా లభిస్తుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. దాంపత్య జీవితంలో సమస్యలు ఉంటే తొలగిపోయి, సుఖ సంతోషాలు వృద్ది చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. ఉద్యో గంలో ప్రాధాన్యం, ప్రాభవం వృద్ధి చెందుతాయి. రాజపూజ్యాలు కలుగుతాయి. ధన యోగాలు పడతాయి.
  5. ధనుస్సు: చతుర్థ స్థానంలో శుక్రుడి ఉచ్ఛ స్థితి వల్ల ఈ రాశివారికి కూడా అన్ని రంగాల్లోనూ ఉచ్ఛ స్థితి కలుగుతుంది. గృహ, వాహన యోగాలు కలుగుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో రాజయోగాలు పడతాయి. వ్యాపారాల్లో లాభాలు అంచనాల్ని మించుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
  6. మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు తృతీయ స్థానంలో ఉచ్ఛ పట్టడం వల్ల అనేక శుభ యోగాలు కలిగే అవకాశం ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవులకు చేరుకోవడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. దాంపత్య జీవితం బాగా అన్యోన్యంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు బాగా పెరుగుతాయి. తండ్రి వైపు నుంచి విలువైన ఆస్తి సంక్రమిస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *