Lord Shiva: సోమవారం శివయ్య అనుగ్రహం కోసం ఎలా పూజ చేయాలి? ఏ రాశివారు ఏమి సమర్పించడం ఫలవంతం అంటే..

Lord Shiva: సోమవారం శివయ్య అనుగ్రహం కోసం ఎలా పూజ చేయాలి? ఏ రాశివారు ఏమి సమర్పించడం ఫలవంతం అంటే..


సోమవారం హిందూ మతంలో చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. శివ పూజకి చాలా ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజు శివుని ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ రోజున శివయ్యను పూజించడం వల్ల అన్ని దుఃఖాలు, కష్టాలు తొలగిపోతాయి. దీనితో పాటు భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. అలాగే ఆహారం, డబ్బు లకు ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయని నమ్మకం. అంతేకాదు సోమవారం శివుడితో పాటు నవ గ్రహాల్లో ఒకటైన చంద్రుడిని కూడా పూజిస్తారు. మీరు శివుడిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే.. కొన్ని ప్రత్యేక వస్తువులను సమర్పించాలి. ఇలా చేయడం వలన శివయ్య ఆశీర్వాదాలు లభిస్తాయి. దీనితో పాటు సోమవారం ఉపవాసం ఉండటం కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

శివుని ఆశీస్సులు పొందాలనుకుంటే సోమవారపు నియమాల ప్రకారం పూజ చేసి అనంతరం శివయ్య పూజలో రాశి ప్రకారం కొన్ని ప్రత్యేక వస్తువులు సమర్పించండి. చివరిగా ‘లింగాష్టకం స్తోత్రం’ పఠించండి.

శివుని పూజా విధానం- విధి

  1. పూజ ప్రారంభించే ముందు శివుడిని ధ్యానించి, పూజ కోసం ఒక సంకల్పం చేయండి.
  2. ముందుగా, శివలింగానికి నీటిని సమర్పించండి.
  3. ఇవి కూడా చదవండి

  4. తరువాత పంచామృతంతో అభిషేకం చేయండి.
  5. ‘ఓం నమః శివాయ’ అనే మంత్రాన్ని జపించండి.
  6. శివలింగంపై తెల్ల గంధపు చెక్క పేస్ట్ రాయండి.
  7. బిల్వ ఆకులు, ధాతుర, జమ్మి ఆకులు, పువ్వులు సమర్పించండి.
  8. ధూపం , దీపం వెలిగించండి.

శివుడికి రాశి ప్రకారం ఏ వస్తువులను సమర్పించాలంటే

  1. మేష రాశి : ఈ రాశి వారు ఈ రోజున శివుడికి బిల్వ పత్రాలను సమర్పించాలి.
  2. వృషభ రాశి: వృషభ రాశి వారు ఈ రోజున శివుడికి ఖీర్ నివేదన చేయాలి.
  3. మిథున రాశి: మిథున రాశిలో జన్మించిన వ్యక్తి శివుడికి భాంగ్ సమర్పించాలి.
  4. కర్కాటక రాశి: కర్కాటక రాశి వారు శివుడికి శంఖం పువ్వులను సమర్పించాలి.
  5. సింహ రాశి: సింహ రాశిలో జన్మించిన వ్యక్తి మహాదేవుడికి అభిషేకం చేయాలి.
  6. కన్య రాశి : కన్య రాశి వారు శివుడికి పాలతో చేసిన స్వీట్లను సమర్పించాలి.
  7. తుల రాశి : తుల రాశి వారు శంకరుడికి సుగంధ ద్రవ్యాలను సమర్పించాలి.
  8. వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారు శివుడికి పంచామృతం సమర్పించాలి.
  9. ధనుస్సు: ధనుస్సు రాశి వారు శంకరుడికి గోపీ చందనాన్ని అర్చించాలి.
  10. మకరం: మకర రాశి వారు శివుడికి కొబ్బరికాయ , కలవను సమర్పించాలి.
  11. కుంభ రాశి: కుంభ రాశిలో జన్మించిన వ్యక్తి శివుడికి నువ్వుల లడ్డులను సమర్పించాలి.
  12. మీన రాశి: మీన రాశిలో జన్మించిన వ్యక్తి శివుడికి పసుపు రంగు పువ్వులు సమర్పించాలి.

దీని తరువాత.. లింగాష్టకం స్తోత్రాన్ని పఠించండి. చివరిగా హారతిని ఇవ్వండి. ఇలా చేయడం వలన శివుని అనుగ్రహంతో పాటు కోరుకున్న ఆశీర్వాదాలను పొందుతారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *