మనోడు మాటల్లోని ఓ పాయింట్ పట్టుకున్న ఫ్యాన్స్ ఎగిరిగంతేస్తున్నారు. ఓ డార్క్ మీమ్‌ను కామెడీగా నెట్టింట వైరల్ చేస్తున్నారు. లోకి డైరెక్ట్ చేసిన ది మోస్ట్ అవేటెడ్ లేటెస్ట్ మూవీ కూలీ..! ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలోనే జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. లోకేష్ కనగరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. విక్రమ్‌తో తన అభిమాన హీరో కమల్‌తో సినిమా చేశానని… కూలీతో రజినీ కాంత్‌తో సినిమా చేయాలనే కోరిక కూడా నెరవేరిందంటూ చెప్పుకొచ్చిన లోకేష్.. ఇక ఇప్పుడు తెలుగు హీరోలతోనే నెక్ట్స్ సినిమాలు తెరకెక్కించాలంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. తాను కమిట్ అయిన సినిమాలను ఫినిష్ చేశాక.. తెలుగు స్టార్ హీరోలతో సినిమాలు చేస్తానంటూ లోకి చెప్పాడు. అయితే ఈ లైన్ దగ్గరే అగిన ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఎందుకంటే గతంలో లోకేష్ ఓ పది పన్నెండు సినిమాలు చేసి.. సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటా అంటూ చెప్పాడు. లోకి వర్స్‌లోని కొన్ని సినిమాలు ఫినిష్ అయ్యాక ఈ విషయం గురించి సీరియస్‌గా ఆలోచిస్తా అంటూ చెప్పాడు. కానీ కూలీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. గతంలో ఇచ్చిన తన స్టేట్మెంట్‌కు భిన్నంగా తెలుగు హీరోలతో సినిమాలు చేస్తానంటూ చెబుతున్నాడు. దీంతో లోకి ఫ్యాన్స్ లోకిది నాలుకా తాటి మట్టా.. మాట మార్చావు కదా అంటూ.. మీమ్స్ చేస్తున్నారు. ఖుష్ కబర్ అంటూ ఆ మీమ్‌కు ట్యాగ్ ఇచ్చి నెట్టింట వైరల్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిరు మాదిరి లీకిచ్చిన రజినీ.. పాపం! లోకేష్!
నాగ్‌లోని గొప్ప విషయం అదే! కింగ్‌ను ఆకాశానికెత్తిన రజినీ..
నోరు జారిన రజినీ.. తప్పుడబుతున్న రాజమౌళి ఫ్యాన్స్
నేను నో చెప్పినా లోకేష్ వెంట పడ్డాడు.. కానీ ఆ ఒక్క విషయంలోనే బాధ
షాకింగ్ కిడ్నాప్ డ్రామా.. అసలు సంగతి తెలిసి పోలీసుల షాక్