ఈ లక్షణాలను విస్మరించడం వల్ల మీ కాలేయం మరింత ప్రభావితమై.. అత్యవసర పరిస్థితికి దారితీయొచ్చు.. రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేయడం కూడా లివర్ దెబ్బతినడానికి సంకేతం కావచ్చు. చాలా మంది తరచుగా మూత్ర విసర్జన చేయడం మధుమేహానికి సంకేతంగా భావిస్తారు.. కానీ మధుమేహం కాకుండా, తరచుగా మూత్ర విసర్జన చేయడం కూడా లివర్ దెబ్బతినడానికి సంకేతం కావచ్చు. రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తే, దానిని విస్మరించకండి.. వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించండి. కాలేయ సమస్యలు, ముఖ్యంగా లివర్ సిర్రోసిస్ విషయంలో రాత్రి నిద్రకు అంతరాయం కలుగుతుంది. రాత్రిపూట నిద్రకు పదేపదే అంతరాయం కలిగిస్తుంది లేదా నిద్రపోవడంలో ఇబ్బంది కలుగుతుంది. లివర్ దెబ్బతిన్నప్పుడు చర్మంపై దురద సమస్య పెరుగుతుంది. ముఖ్యంగా రాత్రి లేదా సాయంత్రం చర్మం దురదగా ఉంటుంది.. అరచేతులు, పాదాలలో నిరంతరం దురద వస్తుంటే.. ఈ సమస్యను విస్మరించవద్దు. లివర్ సమస్యల వల్ల పాదాలలో వాపు సమస్య కూడా ఉండవచ్చు. రాత్రి నిద్రపోతున్నప్పుడు పాదాల వాపు లాంటివి కనిపిస్తే.. ఈ సమస్యను విస్మరించవద్దు, వీలైనంత త్వరగా వైద్యుడిని సంప్రదించండి. లక్షణాలను గుర్తించి సకాలంలో చికిత్స పొందడం ద్వారా, లివర్ దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యనిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jr NTR: వార్ 2 ను అందుకే అంగీకరించాను
Weather Alert: వెదర్ వార్నింగ్.. మూడు రోజులు భారీ వర్షాలు..