మనం రోజంతా యాక్టీవ్‌గా ఉండాలన్నా, కరెక్ట్‌గా పనిచేయాలన్నా మన శరీరానికి మంచి శక్తి స్థాయిలు చాలా అవసరం. మన శరీరంలో ఉండే శక్తి వల్లే మనం రోజంతా యాక్టీవ్‌గా పనిచేసుకుంటున్నాం. కానీ డెయిలీ లైఫ్‌లో మనం చేసుకునే కొన్ని అలవాట్లు మన శరీరంలోని శక్తి స్థాయిలను క్రమంగా తగ్గిస్థాయట. ఈ అలవాట్లు మొదట హానిచేయనివిగా అనిపించవచ్చు కానీ కాలక్రమేణా ఇవి మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని సృష్టించగలవు. దీని వల్ల తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసిపోయినట్లు, చిరాకుగా లేదా నిద్ర లేనట్టు అనిపిస్తుంది. మీ శక్తి స్థాయిలను క్షీణింపజేసే అలవాట్లను వదిలించుకోవాలంటే ఫస్ట్ మీరు ఆ అలవాట్లు ఏవని గుర్తించాలి, ఆ తర్వాత వాటికి ఎలా పులిస్టాప్ పెట్టాలో తెలసుకోవాలి, ఇక్కడ మీ శక్తి స్థాయిలను దెబ్బతీసే అలవాట్లు, మీ శక్తి స్థాయిలను ఎలా మెరుగుపరచాలో తెలుసుకుందాం.
మీ శక్తి స్థాయిలను నిశ్శబ్దంగా దెబ్బతీసే అలవాట్లు
1. సరైన నిద్ర షెడ్యూల్ లేకపోవడం
కొందరు పని ఒత్తిడి కారణంగా కరెక్ట్‌గా నిద్రపోరు. మరి కొందరు ఏటైంలో పడితో ఆ టైంలో పడుకుంటూ ఉంటారు. నైట్ షిప్ట్ చేసేవాళ్లు డే టైంలో పడుకుంటూ ఉంటారు. షిఫ్ట్‌ల ప్రకారం ఉద్యోగం చేసే మరి కొందరు రోజుకు ఒక టైంలో నిద్రపోతూ ఉంటారు. ఇలా నిద్రకు ఒక షెడ్యూల్ లేకుండా పడుకోవడం వల్ల మీ శరీరం యొక్క సహజ సిర్కాడియన్ లయకు అంతరాయం కలుగుతుంది. దీని వలన మీరు రోజంతా అలసటగా, నీరసంగా అనిపించవచ్చు. కాబట్టి మీరు ఒక షెడ్యూల్ పెట్టుకొని రోజూ అదే సమయానికి నిద్రపోవడం మంచింది.
2. బ్రేక్ ఫాస్ట్ తినకపోవడం
ఈ మధ్య కాలంలో చాలా మంది బ్రేక్ ఫాస్ట్ నితకుండా దాటవేస్తూ ఉన్నారు. ఇలా చేయడం కారణంగా మీ శరీరానికి అవసరమైన పోషకాలు అందవు, అంతేకాకుండా రాబోయే రోజు మీ జీవక్రియను దెబ్బతీస్తుంది. కాబట్టి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, కలిగిన ఓట్ మీల్ లేదా తృణధాన్యాల టోస్ట్ తో గుడ్లు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో సమతుల్య అల్పాహారం తీసుకోవడాన్ని మీ బ్రేక్ ఫాస్ట్‌లో చేర్చుకొండి.
3. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం
ఎక్కువ షుగర్ ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల శక్తి ఎంత త్వరగా వస్తుంలో అంతే త్వరగా నశిస్తుంది కూడా ఇలా చేయడంతో మీరు మొదటి కంటే ఎక్కువగా అలసిపోతారు. కాబట్టి చక్కెర ప్రమాదాలను నివారించడానికి ప్రాసెస్ చేసిన వాటి కంటే మొత్తం ఆహారాలను ఎంచుకోండి లేదా పండ్లు, గింజలు లేదా పెరుగును తినండి.
4. శారీరక శ్రమ లేకపోవడం
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ప్రతి ఒక్కరు కంప్యూటర్స్ ముందు కూర్చొని పనులు చేయడమే సరిపోతుంది. లేచి కాసేపు నడవడం కూడా కుదరట్లేదు. దీని వల్ల శారీరక శ్రమ తగ్గిపోతుంది. ఈ నిశ్చల జీవనశైలి వల్ల రక్త ప్రసరణ సరిగా లేకపోవడం, కండరాల దృఢత్వం, ఎండార్ఫిన్ స్థాయిలు తగ్గుతాయి. ఈ అంశాలన్నీ మీ శక్తిని, మానసిక స్థితిని దెబ్బతీస్తాయి. కావున ప్రతిరోజూ కనీసం 20 నిమిషాలైన లేచి అటూ ఇటూ తిరగడమో, లేదా తేలికపాటి యోగా లేదా వ్యాయాయం చేయడం వల్ల మీ రక్త ప్రసరణ పెరిగి శక్తి స్థాయిలను పెంచుతుంది.
5. ఎక్కువగా కెఫిన్ తీసుకోవడం
కెఫీన్ మీద ఎక్కువగా ఆధారపడటం వల్ల శక్తి తగ్గడం, నిద్ర సరిగా లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవాలి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు కెఫిన్‌కు అడెక్ట్ కావచ్చు. కావున మధ్యాహ్నం 2 గంటల తర్వాత కెఫిన్ తీసుకోవడం తగ్గించడానికి ప్రయత్నించండి. తేలికపాటి శక్తిని పెంచడానికి హెర్బల్ టీ లేదా గ్రీన్ టీ వంటి ప్రత్యామ్నాయాలను ఎంచుకోండి
6.అధిక స్క్రీన్ సమయం
చాలా మందికి పడుకునే ముందు ఫోన్ చూడడం అలవాటు. ఇలా పడుకునే ముందు స్క్రీన్‌లను ఎక్కువసేపు చూడటం వల్ల మెలటోనిన్ ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. ఇది మీ నిద్ర నాణ్యత తగ్గుతుంది అంతేకాకుండా మరుసటి రోజు శక్తిపై ప్రభావం చూపుతుంది. కాబట్టి 20-20-20 నియమాన్ని ఉపయోగించండి, అంటే ప్రతి 20 నిమిషాలకు, 20 అడుగుల దూరంలో ఉన్న దేనినైనా 20 సెకన్ల పాటు చూడండి, ఇది కంటి ఒత్తిడి, మానసిక అలసటను తగ్గిస్తుంది.
7. ప్రతికూల స్వీయ-చర్చ లేదా ఒత్తిడి
ఎక్కువ ఒత్తిడిని ఫీల్ అవడం, ఎక్కవగా ఆలోచించడం, మనలో మనమే మాట్లాడుకోవడం మన మానసిక శక్తిని హరించివేస్తాయి. ఇది భావోద్వేగ అలసట, ప్రేరణ తగ్గడానికి దారితీస్తుంది. కాబట్టి మీరు ఎప్పుడూ మీ మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించండి.
(గమనిక: పైన పేర్కొన్న సలహాతో సహా ఈ కంటెంట్ సాధారణ సమాచారాన్ని మాత్రమే అందిస్తుంది. ఇది ఏ విధంగానూ అర్హత కలిగిన వైద్య అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. కాబట్టి వీటిపై మీకు ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులు లేదా మీ స్వంత వైద్యుడిని సంప్రదించండి.)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.