చాలా మందికి నిద్ర లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది . వారు తమ రోజును ఒక కప్పు కాఫీతో ప్రారంభిస్తారు. అంతేకాకుండా, ఆఫీసుల్లో పనిచేసే వారు తరచూ విరామం తీసుకొని కాఫీ తాగి రిలాక్స్ అవుతూ ఉంటారు. అయితే ఈ అలవాటు మితంగా ఉంటే ఓకే.. కానీ అమితంగా మారితేనే అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే కాఫీలో ఉండే కెఫిన్ మన రక్తంలోని చక్కెర స్థాయిలను తాత్కాలికంగా పెంచుతుందని కొని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎందుకంటే కెఫిన్ అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లను పెంచుతుంది. ఇది చక్కెరను ప్రాసెస్ చేసే కణాల సామర్థ్యాన్ని తాత్కాలికంగా తగ్గిస్తుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని కూడా ప్రభావితం చేస్తుంది, అంటే మీ శరీర కణాలు ఇన్సులిన్ హార్మోన్‌కు తగిన విధంగా స్పందించవు. ఇలాంటప్పుడే మనకు కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు. కెఫిన్‌తో పాటు, కాఫీలో యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం వంటి అనేక ఇతర బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉంటాయి. ఈ మూలకాలు శరీరంలో మంట స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
డయాబెటీస్ రోగులు కాఫీ తాగొచ్చా..
మనుషుల్లో అందరూ ఒకేలా ఉండరు. కొన్ని పదార్థాలకు ఒక్కొక్కరి శరీరం ఒక్కలా రియాక్ట్ అవుతూ ఉంటుంది. కొందరు వ్యక్తులకు కెఫిన్‌కు భిన్నంగా స్పందిస్తుంది. కెఫిన్ కొంతమంది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతే, మరి కొంతమందిపై మాత్రం అస్సులు ఎలాంటి ప్రభావం చూపదు. అలాంటి వాళ్లు కాఫీ తాగిన పెద్దగా ప్రభావం ఉండదు. కానీ డయాబెటిస్ ఉన్నవారు కాఫీ తీసుకునే సమయం, పరిమాణం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కాఫీ వాళ్లలో చక్కెర స్థాయిలను మరింతగా పెంచవ్చు. అందుకోసం డయాబెటిస్ ఉన్నవారు చక్కెర, భారీ పాలతో చేసిన కాఫీని తాగడం తగ్గించుకుంటే మంచిది. దానికి బదులుగా, వారు బ్లాక్ కాఫీ తాగవచ్చు. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ఏ విధంగానూ ప్రభావితం చేయదు.
బ్లాక్ కాఫీ vs కాఫీ
మీరు తాగే కాఫీ రకాన్ని బట్టి మీ సమస్య ఉంటుంది. మీ కాఫీలో చక్కెర, పాలు లేదా ఫ్లేవర్డ్ సిరప్‌లను కలుపుకోవడం వల్ల మీ రక్తంలో కచ్చితంగా చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కానీ చక్కెర, పాలు లేకుండా తీసుకునే బ్లాక్ కాఫీలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే నిపుణులు బ్లాక్ కాఫీ మంచి ఎంపిక అని చెబుతారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.