ఎల్ఐసీ జీవన్ ఆనంద్: మీరు తక్కువ బడ్జెట్లో గొప్ప జీవిత బీమాను కోరుకుంటే.. ఈ పాలసీ మీకు సరైన ఎంపిక. మీరు దీన్ని రోజుకు కేవలం రూ. 45 లేదా నెలకు రూ. 1358తో ప్రారంభించవచ్చు. ఈ పాలసీతో మీరు భవిష్యత్తులో రూ. 25 లక్షల వరకు అందుకుంటారు. ఈ ప్లాన్ యొక్క కనీస వ్యవధి 15 ఏళ్లు. ఈ గడువు ముగిసిన తర్వాత బోనస్‌తో మొత్తాన్ని పొందుతారు.
జీవన్ శిరోమణి: ఈ ప్లాన్ ముఖ్యంగా మంచి ఆదాయం ఉండి, ఎక్కువ రాబడిని కోరుకునే వ్యక్తుల కోసం. ఇది నాన్-లింక్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. దీనిలో పెట్టుబడి కాలం తక్కువగా ఉంటుంది. దీనిలో, మీరు రూ.1 కోటి వరకు బీమా మొత్తాన్ని ఎంచుకోవచ్చు. ఉదాహరణకు.. మీరు 30 ఏళ్ల వయస్సు గలవారైతే.. మీరు 20ఏళ్ల పాలసీ తీసుకుంటే.. ఏడాదికి రూ.7.59 లక్షల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ప్రీమియం వ్యవధి 4 ఏళ్లు. కానీ 20 ఏళ్ల తర్వాత ఆ డబ్బు మీ చేతికి అందుతుంది.
ఎండోమెంట్ ప్లాన్: ఈ ప్లాన్ బీమా కంటే పెట్టుబడిపై ఎక్కువ దృష్టి పెట్టే వ్యక్తుల కోసం. ఈ ప్లాన్‌లో.. మీరు స్థిర రాబడిని పొందుతారు. బోనస్ కూడా లభిస్కతుంది. ఇది మీ పొదుపులను సేఫ్‌గా ఉంచే చేసే తక్కువ-రిస్క్ ప్లాన్. మంచి రాబడితో సురక్షితమైన పెట్టుబడిని కోరుకుంటే..ఈ ప్లాన్ మీకు సరైనది.
జీవన్ ఉమాంగ్: మీరు పదవీ విరమణ తర్వాత కూడా ఆదాయం కొనసాగాలని కోరుకుంటే.. ఈ పథకం మీకు బెస్ట్ ఛాయిస్. ఈ పథకంలో ప్రీమియం చెల్లించిన తర్వాత.. మీకు ప్రతి ఏడాది 8శాతం డబ్బు తిరిగి లభిస్తుంది. మీరు మీ జీవితాంతం ఈ ఆదాయాన్ని పొందుతూనే ఉంటారు. పాలసీదారు మరణిస్తే, కుటుంబానికి పూర్తి బీమా కవరేజ్ లభిస్తుంది.
జీవన్ తరుణ్: మీరు మీ పిల్లల విద్య, పెళ్లి లేదా భవిష్యత్తు ఆర్థిక అవసరాల గురించి ఆందోళన చెందుతుంటే.. ఈ పథకం ప్రత్యేకంగా మీ కోసం. ఈ పాలసీలో, పిల్లలకి 25ఏళ్ల వయస్సు వచ్చే వరకు పెట్టుబడి పెట్టాలి. ఈ పథకంలో పిల్లలకి 20 నుండి 25 సంవత్సరాల వయస్సు మధ్య ప్రతి ఏడాది కొంత మొత్తం లభిస్తుంది. చివరికి ఒకేసారి మొత్తం, బోనస్ లభిస్తుంది.