Lavanya Tripathi: మా ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకునేది లేదు.. వారికి లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ వార్నింగ్ .. ఏమైందంటే?

Lavanya Tripathi: మా ఫ్యామిలీ జోలికొస్తే ఊరుకునేది లేదు.. వారికి లావణ్య త్రిపాఠి స్ట్రాంగ్ వార్నింగ్ .. ఏమైందంటే?


కాగా గతేడాది బ్రహ్మానందం అనే సినిమా ఈవెంట్‌లో చిరంజీవి వారసుడిపై కమెంట్స్ చేసారు.. ఇంటికి వెళ్తే లేడీస్ హాస్టల్ వార్డెన్‌లా ఉంటుందంటూ సరదాగా చేసిన కామెంట్స్ బాగా వివాదం అయ్యాయి. ఆ కామెంట్స్ ను గుర్తు చేస్తూ మొన్న రామ్ చరణ్-ఉపాసన దంపతులకు బాబు పుట్టిన వేళ చిరంజీవిని మళ్లీ ట్రోల్ చేసారు.. ఆ విమర్శలకు మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి గట్టిగా కౌంటర్ ఇచ్చారు.. సంతోషకరమైన క్షణాలను వివాదాస్పదం చేయడంపై అసహనం వ్యక్తం చేస్తూ, చిరంజీవి మహిళలను గౌరవించే తీరును ఆమె ట్వీట్ రూపంలో తెలియజేసారు.. ఇతరులను విమర్శించే ముందు వ్యక్తిగతంగా తెలుసుకోవాలని ఆమె ట్వీట్ చేశారు. నిజంగా ఆయన్ను, ఆయన కుటుంబంలో మహిళలను ఎలా చూసుకుంటారో తెలియనప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ లావణ్య తెలిపారు. ఈ కామెంట్స్ మీద ఇప్పుడు మరోసారి లావణ్య రియాక్ట్ అయ్యారు.. చిరంజీవి గారు ఇంట్లో ఎలా ఉంటారనేది తమకు తెలుసు అని.. తమ కుటుంబం జోలికి ఎవరైనా వస్తే అస్సలు ఊరుకోను అని చెప్పారు లావణ్య

చిరంజీవి తన కుటుంబంలోని మహిళల్ని, ముఖ్యంగా తన మనవరాళ్లని ఎంత ప్రేమగా, గౌరవంగా చూస్తారో ఈ విమర్శలు చేసేవారికి అస్సలు అవగాహన లేదు. ఆయన చేసే పనుల్లో 1 శాతం కూడా చేయలేని వాళ్లు.. ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడటం సరికాదు మా ఫ్యామీలీ జోలికొస్తే ఊరుకోనని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

లావణ్య త్రిపాఠి కామెంట్స్..

కాగా పెళ్లి తర్వాత లావ‌ణ్య త్రిపాఠి నటిస్తోన్న మరో చిత్రం ‘సతీ లీలావతి’. ఇందులో లావణ్యకు జోడీగా దేవ్ మోహన్ నటిస్తున్నాడు. తాతినేని స‌త్య ఈ మూవీకి దర్శకత్వంవహిస్తున్నారు. అలాగే ప్రఖ్యాత‌ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ (Anandi Art Creations) సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

గతంలో లావణ్య ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *